VVS Laxman: ఆసియా గేమ్స్ లో పాల్గొనే భారత జట్టుకు కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్
దిగ్గజ బ్యాట్స్‌మన్, నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆసియా క్రీడలలో పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటారు.
- By Gopichand Published Date - 10:35 AM, Sun - 27 August 23

VVS Laxman: భారత్‌లో ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కాగా, అదే సమయంలో చైనాలో ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందులో భారత క్రికెట్ జట్టు కూడా పాల్గొంటోంది.పురుషుల జట్టుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా 2023 ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనుంది.
నివేదికలను విశ్వసిస్తే.. దిగ్గజ బ్యాట్స్‌మన్, నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆసియా క్రీడలలో పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటారు. అదే సమయంలో హృషికేశ్ కనిట్కర్ భారత మహిళల క్రికెట్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ఆలూర్‌లో భారత వర్ధమాన ఆటగాళ్ల కోసం హై పెర్ఫార్మెన్స్ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు.
Also Read: ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్.. భారత్ స్థానం ఎక్కడంటే..?
లక్ష్మణ్‌తో పాటు ఆసియాడ్ కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌గా, మునీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారని TOI నివేదించింది. భారత మహిళల జట్టు విషయానికొస్తే.. కొత్త ప్రధాన కోచ్, సహాయక సిబ్బంది నియామకం అంతర్జాతీయ దేశీయ సీజన్ ప్రారంభం వరకు వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కనిట్కర్ తో పాటు బౌలింగ్ కోచ్‌గా రజిబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్ చైనాకు వెళ్లనున్నారు.