Kohli Gift: అభిమానికి వెలకట్టలేని గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్, చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తన మార్క్ చూపించాడు.
- By Praveen Aluthuru Published Date - 04:35 PM, Tue - 9 May 23

Kohli Gift: టీమిండియా మాజీ కెప్టెన్, చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తన మార్క్ చూపించాడు. అదేవిధంగా ఈ సీజన్ లో తన ఖాతాలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ రోజు బెంగుళూరు, ముంబై పోటాపోటీగా తలపడనున్నాయి. అంతకుముందు వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేశాయి.
ఐపీఎల్ 54వ మ్యాచ్ మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రాణించాల్సిన అవసరం ఉంది. కాగా.. వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీని చూసేందుకు అతని అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో అతని అభిమానులు అతన్ని ఉత్సాహపరుస్తూ కనిపించారు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎంత దూకుడుగా కనిపించినా.. అభిమానులను కలిసినప్పుడు మాత్రం సరదాగా ఉంటాడు.
Virat Kohli gifted his signed bat to a fan at Wankhede.#viratkohli #MIvsRCB pic.twitter.com/C4XYi6Vo1F
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 9, 2023
వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ తన అభిమాని ఒకరికి అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. ఆ అభిమానికి ఈ బహుమతి వెలకట్టలేనిది. విరాట్ తన అభిమానిలో ఒకరికి తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ బ్యాట్ పై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కోహ్లీ తన జట్టు సిబ్బందికి “ఆ బ్యాట్ అతనికి ఇవ్వండి” అని చెప్పడం చూడవచ్చు.ఈ సీజన్‌లో విరాట్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిపిస్తోంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 376 పరుగులు చేశాడు.
Read More: Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ అప్పుడే… మహి మనసులో మాట చెప్పిన రైనా…