HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Unseen Test Day In Pakistan As Records Shattered In Rawalpindi

Pakistan v England: ఆడుతోంది టెస్టా.. వన్డేనా..? పాక్ పై ఇంగ్లాండ్ రికార్డుల మోత

సొంత గడ్డపై పాకిస్థాన్ బౌలర్లకు ఇంతకన్నా ఘోర అవమానం మరొకటి ఉండదు.

  • Author : Gopichand Date : 02-12-2022 - 9:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (2)
Cropped (2)

సొంత గడ్డపై పాకిస్థాన్ బౌలర్లకు ఇంతకన్నా ఘోర అవమానం మరొకటి ఉండదు. ఇంగ్లీష్ బ్యాటర్లు రెచ్చిపోయిన వేళ రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు రికార్డుల మోత మోగింది. పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఇంగ్లీష్ తొలి రోజే 500 పైగా రన్స్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌ లతోపాటు ఓలీ పోప్‌ , హ్యారీ బ్రూక్‌ సెంచరీల మోత మోగించారు. తొలి రోజే నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం కూడా వరల్డ్‌ రికార్డే. వెలుతురు సరిగా లేక ఆట ముగిసే సమయానికి కేవలం 75 ఓవర్లలోనే 4 వికెట్లకు 506 రన్స్‌ చేసింది. ఒకవేళ మొత్తం 90 ఓవర్ల ఆట జరిగి ఉంటే ఇంగ్లండ్‌ మరిన్ని రికార్డులను అందుకునేది. ఓపెనర్లు ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 233 రన్స్ జోడించారు. ఆ తర్వాత 50 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.

తొలి రోజు ఇంగ్లండ్‌ ఏకంగా ఓవర్‌కు 6.74 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. పాక్‌ బౌలర్లలో కేవలం మహ్మద్‌ అలీ మాత్రమే ఓవర్‌కు ఆరు పరుగుల కంటే తక్కువ రన్స్‌ ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు అందరూ 6 కంటే ఎక్కువ ఎకానమీతో రన్స్ ఇచ్చారు. ఈ స్కోరుతో ఇంగ్లాండ్ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910లో ఆస్ట్రేలియా , సౌతాఫ్రికాపై నెలకొల్పిన రికార్డును ఇంగ్లాండ్ అధిగమించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో వేగంగా ఆడి ఇంగ్లండ్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • england
  • pakistan
  • Pakistan vs England
  • Rawalpindi

Related News

Sri Lanka Fuel Price Hike

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Sri Lanka Fuel Price Hike  ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో, ఈ రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీలంకలో పెరిగిన ధరల వివరాలు (లీటరు

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd