HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Travis Head Is Ready To Set A Huge Record Against Team India

Travis Head: టీమిండియాపై భారీ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైన ట్రావిస్ హెడ్

రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

  • Author : Gopichand Date : 12-12-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Travis Head
Travis Head

Travis Head: ఆస్ట్రేలియా సెన్సేషన్ ట్రావిస్ హెడ్ (Travis Head) టీమిండియాకు తలనొప్పిగా మారాడు. సాధారణ మిడిలార్డర్ బ్యాటర్‌‌గా కొనసాగిన హెడ్ ప్రస్తుతం ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ భారత్ పై పూనకాలు వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.

రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడు సిరీస్‌లో మూడో మ్యాచ్ గబ్బాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో హెడ్ భారీ రికార్డుకు ఎసరు పెట్టాడు. గత కొన్నేళ్లుగా ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారాడు. భారత్‌తో జరిగిన అనేక ముఖ్యమైన మ్యాచ్‌లలో హెడ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలే ఇచ్చాడు.

Also Read: Vastu Tips: మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలు చుట్టుముట్టడం ఖాయం!

ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాతో ఆడనున్న గబ్బా టెస్టులో కేవలం 45 పరుగులు చేస్తే అతని పేరు మీద మొత్తం టెస్టు క్రికెట్‌లో భారత్‌పై 1000 పరుగులకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఏ జట్టుపైనా టెస్టు క్రికెట్‌లో 1000 పరుగుల సంఖ్యను హెడ్ టచ్ చేయలేకపోయాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంగ్లిష్ జట్టుపై హెడ్ 24 ఇన్నింగ్స్‌ల్లో 910 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియాపై టెస్టు క్రికెట్‌లో 21 ఇన్నింగ్స్‌ల్లో 47.75 సగటుతో 955 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 2 సెంచరీలు మరియు 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అడిలైడ్ టెస్టులో హెడ్ రెండో సెంచరీ సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో అతను తన మొదటి సెంచరీని సాధించాడు. అయితే టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌పై హెడ్‌ రాణించకపోవడం గమనార్హం. ఎందుకంటే ఈ విధ్వంసకర బ్యాట్స్ మెన్ పాకిస్థాన్‌పై 14 ఇన్నింగ్స్‌ల్లో 295 పరుగులు మాత్రమే చేశాడు. అతని టెస్ట్ సగటు 22.69 మాత్రమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Border-Gavaskar Trophy
  • cricket news
  • IND vs AUS
  • sports news
  • team india
  • Travis Head

Related News

Rohit Sharma

ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

గత ఏడాది రోహిత్ శర్మ చాలా మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ కనిపించారు. ఫీల్డింగ్ సమయంలో ఆయనకు విశ్రాంతిని ఇచ్చేవారు.

  • T20 World Cup Final

    టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్.. వర్షం పడి మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

  • Arjun Tendulkar

    పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

  • T20 World Cup Final

    ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

  • T20 World Cup Prize Money

    టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

Latest News

  • T20WC 2026 : ఫైనల్ మ్యాచ్ క్రేజ్..కొండెక్కిన హోటల్ రూముల ధరలు

  • War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

  • Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

  • Nayanatara : కండల వీరుడు సరసన నయనతార..ఇది మామలు కాంబో కాదు !!

  • Current Charges : కరెంట్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd