ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్!
భారత జట్టు ఐపీఎల్ 2025 కారణంగా గత కొన్ని నెలలుగా టీ-20 అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనలేదు. ఈ కారణంగా కొత్త ఐసీసీ ర్యాంకింగ్‌లలో భారత ఆటగాళ్ల జాబితాలో పెద్దగా మార్పులు జరగలేదు.
- By Gopichand Published Date - 04:18 PM, Wed - 11 June 25

ICC T20 Rankings: ఐసీసీ నేడు కొత్త ర్యాంకింగ్‌లను (ICC T20 Rankings) విడుదల చేసింది. ఇందులో భారత ఆటగాళ్లకు లాభం కలిగినప్పటికీ.. కొంతమంది ఆటగాళ్లకు నష్టం కూడా జరిగింది. కొత్త టీ-20 ర్యాంకింగ్‌లలో తిలక్ వర్మాకు లాభం చేకూరగా, సూర్యకుమార్ యాదవ్‌కు ఒక స్థానం నష్టపోయాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లపై వివరంగా చూద్దాం.
హెడ్ ఆధిపత్యం కొనసాగింపు
భారత జట్టు ఐపీఎల్ 2025 కారణంగా గత కొన్ని నెలలుగా టీ-20 అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనలేదు. ఈ కారణంగా కొత్త ఐసీసీ ర్యాంకింగ్‌లలో భారత ఆటగాళ్ల జాబితాలో పెద్దగా మార్పులు జరగలేదు. ఐసీసీ టీ-20 బ్యాటింగ్ ర్యాంకింగ్‌లలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 856 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 829 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఇక తిలక్ వర్మకు లాభం చేకూరింది. అతను 4వ స్థానం నుండి 3వ స్థానానికి చేరుకున్నాడు. తిలక్ 804 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్నాడు. ఫిల్ సాల్ట్.. వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్ నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. ఈ కారణంగా తిలక్ వర్మకు లాభం చేకూరగా, ఫిల్ సాల్ట్ ఒక స్థానం నష్టపోయాడు.
Also Read: WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
సూర్యకుమార్ యాదవ్‌కు షాక్
సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద షాక్ తగిలింది. అతను 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు. అతని స్థానాన్ని జోస్ బట్లర్ ఆక్రమించాడు. బట్లర్ 6వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్నాడు. బట్లర్ వద్ద 772 పాయింట్లు ఉన్నాయి.
టెస్ట్ ర్యాంకింగ్‌లలో పెద్ద మార్పు?
వచ్చే వారం కొత్త ఐసీసీ ర్యాంకింగ్‌లలో కూడా పెద్ద మార్పులు కనిపించనున్నాయి. ఎందుకంటే జూన్ 11 నుండి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త టెస్ట్ ర్యాంకింగ్‌లలో పెద్ద మార్పులు కనిపించనున్నాయి.