Melbourne Defeat: ఆ మూడు తప్పిదాలే మెల్‌బోర్న్ ఓటమికి ప్రధాన కారణాలు!
మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు.
- By Naresh Kumar Published Date - 11:22 PM, Mon - 30 December 24

Melbourne Defeat: రోహిత్ శర్మ చేసిన మూడు తప్పిదాల కారణంగా మెల్‌బోర్న్ టెస్టులో (Melbourne Defeat) భారత్ ఓడిపోయింది. నిజానికి ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను వరుసగా 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయినా తన ప్రదర్శనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ తర్వాత అతను మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా పునరాగమనం చేసాడు. కానీ ఇక్కడ కూడా చేతులెత్తేశాడు. నిజానికి రోహిత్ ఫామ్ లో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అయితే తన బ్యాటింగ్ అర్దర్ ని మార్చాల్సిన అవసరం లేకపోయినా రాహుల్ స్థానంలో ఓపెనింగ్ కు వచ్చి మిస్టేక్ చేశాడు. గత మ్యాచ్‌లలో నిలకడగా రాణించిన రాహుల్ బ్యాటింగ్ స్థానం మార్చిన తర్వాత స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని భారీ మిస్టేక్ చేశాడని నెటిజన్లు హిట్ మ్యాన్ ని నిందిస్తున్నారు.
మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు. చాలా మంది క్రికెట్ నిపుణులు మెల్‌బోర్న్‌లో శుభ్‌మాన్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ పిచ్ అతని బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉందని చెప్పారు. కానీ గిల్‌ను తొలగించడం ఒకరకంగా రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అంటున్నారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ ప్రభావం అతని కెప్టెన్సీలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ విషయంలో చాలా తడబడ్డాడు. ఒక్కోసారి కోహ్లీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒకరకంగా ఈ టెస్టులో కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటె గెలిచేవాళ్లమన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
Also Read: Tummala Nageswara Rao : జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించా
క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ అత్యవసర నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అసలు మైదానంలో రోహిత్ కెప్టెన్సీపై విశ్వాసం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. బౌలర్లను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఈ కారణంగానే టీమ్ ఇండియా మ్యాచ్ లో ఓడి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.