HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Telugu Girl Trisha Bursts Into Flames In Womens Under 19 Asia Cup

U19 Women’s Asia Cup : మహిళల అండర్‌-19 ఆసియాకప్‌లో చెలరేగిన తెలుగమ్మాయి త్రిష

U19 Women's Asia Cup : శ్రీలంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది

  • Author : Sudheer Date : 21-12-2024 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
U19 Women's Asia Cup Trish
U19 Women's Asia Cup Trish

అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్‌(U19 Women’s Asia Cup)లో అజేయంగా నిలిచిన భారత్ శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ తరఫున ఆయుషి శుక్లా నాలుగు ఓవర్లలో పది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందుకు గానూ ఆమెకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

టాస్ గెలిచి బౌలింగ్ చేసిన భారత్ శ్రీలంకను 9 వికెట్లకు 98 పరుగులకే పరిమితం చేసింది. పరుణికా సిసోడియా రెండు వికెట్లు తీసింది. శ్రీలంక తరఫున నిసంసల 21, కెప్టెన్ మనుడి 33 పరుగులు చేశారు. మిగతా వారెవ్వరు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. శ్రీలంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో బంతికి ఓపెనర్ ఈశ్వరి అవుట్ అయింది ఆ తర్వాత కమలిని 28, త్రిష 32 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. తెలుగు తేజం గొంగడి త్రిష (Trisha ) 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులతో దూకుడుగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు త్రిష గతమ్యాచ్‌లో బంగ్లాపై హాఫ్‌ సెంచరీ బాదింది.

శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ చమోడి ప్రబోద 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఓ దశలో ప్రబోద దూకుడు చూసి భారత్ కంగారు పడింది. కానీ ఆమెకు మరో బౌలర్ నుంచి మద్దతు లేకపోవడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.నిజానికి భారత్ లీగ్ దశ నుంచే అద్భుతాలు చేస్తూ వచ్చింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీని తరువాత బంగ్లాదేశ్ , శ్రీలంకలను మట్టికరిపించింది, నేపాల్‌తో జరిగిన మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆదివారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్‌లో జరగనున్న ఈ టోర్నీ ప్రారంభ ఎడిషన్ టైటిల్ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Read Also : Telangana Assembly : కేటీఆర్ పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • G Trisha
  • trisha
  • Women's Under-19 T20 Asia Cup

Related News

Nainar Nagendran Vijay Tris

విజయ్ రాజకీయాల్లోకి త్రిష ను లాగిన బీజేపీ నేత

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ మరియు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన దళపతి విజయ్‌పై బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

  • PM Tariq Rahman

    బంగ్లాదేశ్‌లో కొత్త శకం.. భారత్-బంగ్లా సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd