Telangana Assembly : కేటీఆర్ పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్
Telangana Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్‌లు బయటపెట్టాలని..దీనికి తాము సిద్ధమని అన్నారు
- By Sudheer Published Date - 03:14 PM, Sat - 21 December 24

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో రైతు భరోసా (Rythu bharosa) అంశంపై చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్-బీజేపీ(BRS-BJP) సభ్యుల మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేటీఆర్ (KTR) వ్యవసాయ భూమి వ్యాపారంగా మారాలా? అని ఆరోపిస్తూ ఆవేశంగా వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఐటీ చెల్లింపులు చేస్తున్నవారు ఉన్నారు, అలాగే పాన్ కార్డు ఉన్న రైతులు ఉన్నారు. అలాంటి వారికీ రైతు భరోసా ప్రాతిపదికన తీసుకుంటే వారికీ కట్ అయ్యే అవకాశముందన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ , బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడం తో శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy) జోక్యం చేసుకుని కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కామ్‌లు బయటపెట్టాలని..దీనికి తాము సిద్ధమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఎలాంటి చర్చ జరుగుతుందో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రైస్ మిల్లుల దగ్గర వేల కోట్ల రూపాయలు బియ్యం ప్రొక్యూర్‌మెంట్ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు. సమావేశాలను మరో వారం పెంచితే అన్ని బయట పెడతామన్నారు. కేంద్రం గురించి అన్యాయంగా మాట్లాడితే ఊరుకునేది లేదని , కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉండడంతో తాను ఎక్కువగా మాట్లాడలేనన్నారు మహేశ్వర్‌రెడ్డి.
Read Also : Rythu Bandhu : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్ రెడ్డి