HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Won Third T20 Against Zmbabwe

Team India Won Third T20 Against Zmbabwe : మూడోది కొట్టేశారు.. జింబాబ్వే టూర్ లో యువభారత్ జోరు

కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubamn Gill) ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి వికెట్ కు జైశ్వాల్ తో కలిసి 8.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించాడు. జైశ్వాల్ 36 రన్స్ కు ఔటవగా.

  • By Ramesh Published Date - 07:57 PM, Wed - 10 July 24
  • daily-hunt
Team India Won Third T20 Against Zmbabwe
Team India Won Third T20 Against Zmbabwe

జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఓడినా పుంజుకున్న యంగ్ ఇండియా (Young India Team) వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హరారే వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న జైశ్వాల్ (Jaiswal) , సంజూ శాంసన్, శివమ్ దూబేలు జట్టులోకి రాగా… సాయిసుదర్శన్, జురెల్, ముకేశ్ కుమార్ లపై వేటు పడింది.మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 182 పరుగులు చేసింది.

కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubamn Gill) ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి వికెట్ కు జైశ్వాల్ తో కలిసి 8.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించాడు. జైశ్వాల్ 36 రన్స్ కు ఔటవగా.. రెండో టీ ట్వంటీలో సెంచరీ హీరో అభిషేక్ శర్మ (Abhishek Sharma) నిరాశపరిచాడు. 10 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో గిల్, రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడారు. గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా…రుతురాజ్ 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

తర్వాత ఛేజింగ్ లో జింబాబ్వేు ఆరంభం నుంచే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. అవేశ్ ఖాన్ (Avesh Khan) , స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ధాటికి ఆతిథ్య జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. కేవల 39 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. అయితే మైర్స్ , వికెట్ కీపర్ మదాండే పోరాడడంతో స్కోర్ 150 దాటగలిగింది. చివరికి జింబాబ్వే (Zimbabwe) 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 , వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ ట్వంటీ (T20) శనివారం జరుగుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Zimbabwe T20 Series
  • India Zimbabwe Tour
  • team india
  • Zimbabwe

Related News

WTC Points Table

WTC Points Table: పాక్‌ను ఓడించిన ద‌క్షిణాఫ్రికా.. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియాకు లాభం!

దక్షిణాఫ్రికా ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 333 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ప్రొటీస్ జట్టు 404 పరుగులు చేయగలిగింది.

  • Rohit Sharma

    Rohit Sharma: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌!

  • Hardik Pandya

    Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

Latest News

  • Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

  • CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

  • Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

  • Rohit Sharma: అజిత్ అగార్కర్‌కు సెంచ‌రీతో స‌మాధానం ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌!

  • Coconut : దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కారణాలు ఇవీ

Trending News

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

    • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

    • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

    • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

    • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd