India T20: నెదర్లాండ్స్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జోరు కొనసాగుతోంది. పాక్‌పై గెలిచి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.
- By Naresh Kumar Published Date - 03:57 PM, Thu - 27 October 22

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జోరు కొనసాగుతోంది. పాక్‌పై గెలిచి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
నెదర్లాండ్స్‌పై భారీస్కోర్ చేస్తారని భావించినా ఆ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి విఫలమై కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. అయితే ఫామ్ కోసం తంటాలు పడుతున్న రోహిత్ మాత్రం నెదర్లాండ్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ తనదైన షాట్లతో అలరించాడు. రోహిత్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 రన్స్ చేసి ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత విరాట్ దూకుడు కొనసాగింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. అటు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. 25 బాల్స్‌లోనే సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్, సూర్య మూడో వికెట్‌కు 8 ఓవర్లలోనే అజేయంగా 95 రన్స్ జోడించారు. కోహ్లీ 44 బంతుల్లో 62 , సూర్యకుమార్ 25 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో పేసర్లు కూడా డచ్ టీమ్‌ను కట్టడి చేశారు. దీంతో నెదర్లాండ్స్ 123 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 2 , అర్షదీప్‌సింగ్ 2 , అక్షర్ పటేల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీసారు. టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడుతుంది.
Two wickets in an over for @ashwinravi99.
Colin Ackermann & Tom Cooper depart.
Live – https://t.co/GVdXQKGVh3 #INDvNED #T20WorldCup pic.twitter.com/BMqKYM0UzO
— BCCI (@BCCI) October 27, 2022
Two wickets in an over for @ashwinravi99.
Colin Ackermann & Tom Cooper depart.
Live – https://t.co/GVdXQKGVh3 #INDvNED #T20WorldCup pic.twitter.com/BMqKYM0UzO
— BCCI (@BCCI) October 27, 2022