HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Tata Secures Ipl Title Sponsorship For Rs 2500 Crore Until 2028

IPL 2024: బీసీసీఐకి ఒక్క ఐపీఎల్ సీజన్‌కు 500 కోట్లు

వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజ‌న్‌కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-01-2024 - 5:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2024
IPL 2024

IPL 2024: వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ, టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజ‌న్‌కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. మర్చి నెలాఖరులో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమవుతుంది.

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. టి20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడనున్నారు. మార్చిలో మొదలై రెండు నెలలపాటు సాగుతుంది. అనంతరం జూన్ మాసంలో టి20 ప్రపంచకప్ మొదలవుతుంది.

ఇండియాలో టాటా సంస్థకు మంచి రెప్యుటేషన్ ఉంది. దాంతో బీసీసీఐ టాటాతో డీల్ కు ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఇప్పుడు టాటా సంస్థ బీసీసీఐ కలిసి ఐపీఎల్ ను నిర్వహించనున్నాయి. విషయమేంటంటే.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ టైటిల్ హ‌క్కుల‌ను టాటా గ్రూప్ ద‌క్కించుకుంది. ఇటీవల టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ వేయగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి రూ.500 కోట్లు చెల్లించేలా మొత్తం ఐదేళ్లకు గానూ .2500 కోట్లతో టెండర్ వేసింది. అయితే టాటా సంస్థ ముందుకొచ్చి అదే మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైంది. దీంతో ఐపీఎల్ టైటిల్ హక్కులు టాటాకే దక్కాయి. ఈ నేపథ్యంలో 2028 వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతీ సీజన్‌కు బీసీసీఐకి.500 కోట్లు చెల్లించనుంది. ఇప్పటికే టాటా, బీసీసీఐ మధ్య బిజినెస్ అగ్రిమెంట్ జరిగింది.

టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ హ‌క్కులు ద‌క్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్స‌ర్‌గా వైదొల‌గ‌డంతో టాటాకు అవ‌కాశం వ‌చ్చింది. ఐపీఎల్‌కు ఏటేటా ప్రేక్షాకాదరణ పెరుగుతుండటంతో ఇటీవలి కాలంలో డిజిటల్ విధానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.దీంతో డిజిటల్ ప్రసార హక్కుల కోసం ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. మ్యాచ్ సమయంలో మధ్య మధ్యలో వచ్చే చిన్నపాటి ప్రకటనల కోసం సదరు సంస్థలు పదిసెకన్లకు పది లక్షలకు పైగానే చెల్లిస్తున్నాయి.

Also Read: Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2028
  • 2500 crore
  • 500 Crores
  • BCCI
  • Five Years
  • ipl 2024
  • Sponsorship
  • tata group
  • Title

Related News

    Latest News

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd