Suryakumar Yadav: చర్చనీయాంశంగా సూర్యకుమార్ యాదవ్ వాచ్.. ధర ఎంతంటే?
ఈ ఖరీదైన వాచ్‌లో జాకబ్ & కంపెనీ, ఎథోస్ వాచెస్ (Ethos Watches) కలిసి అయోధ్య రామమందిరాన్ని ఆకృతిని లోపల ఉంచారు. అంతేకాకుండా ఇందులో శ్రీరాముడు, ఆంజనేయుల నగిషీ కూడా ఉంది.
- By Gopichand Published Date - 05:16 PM, Tue - 30 September 25

Suryakumar Yadav: టీమ్ ఇండియా ఏసీసీ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్య ధరించిన వాచ్ గురించి కూడా చర్చ జరుగుతోంది. రామమందిరంతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఈ వాచ్ గురించి అభిమానులందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఆసియా కప్‌లో సూర్య ప్రతిసారీ ఈ వాచ్‌తోనే మైదానంలో కనిపించారు.
చర్చనీయాంశంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వాచ్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధరించిన జాకబ్ & కంపెనీ (Jacob & Co.)కి చెందిన ఎపిక్ ఎక్స్ రామ జన్మభూమి వాచ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎపిక్ ఎక్స్ రామ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్‌ను ధరించారు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వాచ్. ఇందులో విలాసవంతమైన డిజైన్, గొప్ప వారసత్వం అద్భుతంగా మేళవించబడ్డాయి. భారత కెప్టెన్ ఈ వాచ్‌ను ధరించి పలుమార్లు కనిపించారు. సూర్య దీనిని తనకిష్టమైన వాచ్‌గా భావిస్తారు. ఈ వాచ్ ధర దాదాపు రూ. 34 లక్షలు. సూర్యతో పాటు సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వాచ్‌ను ధరిస్తారు.
Also Read: H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?
అల్ట్రా లగ్జరీ ‘జన్మభూమి ఎడిషన్’ వాచ్
ఈ ఖరీదైన వాచ్‌లో జాకబ్ & కంపెనీ, ఎథోస్ వాచెస్ (Ethos Watches) కలిసి అయోధ్య రామమందిరాన్ని ఆకృతిని లోపల ఉంచారు. అంతేకాకుండా ఇందులో శ్రీరాముడు, ఆంజనేయుల నగిషీ కూడా ఉంది. ఈ కారణంగా కూడా ఈ వాచ్ మరింత ప్రత్యేకంగా మారింది. రామమందిరపు శిలాఫలకం చాలా అద్భుతమైన శైలిలో చెక్కబడింది. ఎపిక్ ఎక్స్ రామ జన్మభూమి ఎడిషన్ భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలకు నివాళులు అర్పిస్తుంది. అందుకే ఈ వాచ్‌ను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కెప్టెన్ సూర్యకు ఈ వాచ్ చాలా అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది.