Sky And Kohli: మూడో టీ20కి కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దూరం.. కారణమిదే..?
టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రేపు (అక్టోబర్ 4) సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నారు.
- Author : Hashtag U
Date : 03-10-2022 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రేపు (అక్టోబర్ 4) సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా 16 రన్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 237 పరుగులు చేయగా.. 238 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగినా సఫారీ జట్టు 221 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఇకపోతే.. మంగళవారం జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌కి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌కు మూడో టీ20కి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఆదివారం మ్యాచ్ అనంతరం కోహ్లీ ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్యాన్స్‌కు కనిపించాడు. 3వ T20 ఇండోర్‌లో జరగనుంది. టీమ్ అంతా ఇండోర్ వెళ్లగా.. కోహ్లీ మాత్రం ఢిల్లీ వెళ్లాడు. దీంతో కోహ్లీ మూడో టీ20కి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది.
@imVkohli set to miss tommorow Match.#ViratKohli𓃵 pic.twitter.com/pQ307bR8D9
— Lordgod 🚩™ (@LordGod188) October 3, 2022
మరోవైపు సూర్యకుమార్ యాదవ్‌కు మూడో టీ20కి విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. సూర్యను డైరక్ట్ గా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ వరకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. అక్కడి నుంచి చెలరేగుతున్నాడు. 10 ఇన్నింగ్స్‌లో 141 స్ట్రైక్‌రేట్‌తో 404 రన్స్ చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.