HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Super Show From Pacers Restrict Sa To 106 8

Ind Vs SA 1st innings:సఫారీలను బెంబేలెత్తించిన అర్ష్ దీప్, చాహార్

టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు.

  • Author : Naresh Kumar Date : 28-09-2022 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harshal Patel Imresizer
Harshal Patel Imresizer

తిరువనంతపురం: టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 106 పరుగులకు పరిమితమయింది. ఒక దశలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎందుకంటే భారత్ బౌలర్లు ఓ రేంజ్ లో ఆ జట్టు బ్యాటింగ్ ను దెబ్బ తీశారు. అర్ష్ దీప్ , దీపక్ చాహర్ ధాటికి సౌతాఫ్రికా కేవలం 2.3 ఓవర్లలో 9 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ అయిదు వికెట్లలో నలుగురు డకౌట్ అయ్యారు.
తొలి ఓవర్‌ చివరి బంతికే సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమాను ఔట్‌ చేసి దీపక్‌ చహర్‌ శుభారంభం అందించాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. అతని దెబ్బకు డికాక్‌ , రూసో , మిల్లర్‌ ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్‌.. స్టబ్స్‌ ను కూడా ఔట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మక్రమ్ 25, పార్నెల్ 24 రన్స్ తో ఆదుకున్నారు. తర్వాత కేశవ్ మహారాజ్ 41 రన్స్ చేయడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 , దీపక్ చహార్ 2 , హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో భారత్ బుమ్ర , చాహల్ కు రెస్ట్ ఇచ్చింది. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

Pic Courtesy: BCCI/Twitter

Innings Break!#TeamIndia bowlers put on a show here in the 1st T20I as they restrict South Africa to a total of 106/8 on the board.

Scorecard – https://t.co/yQLIMooZxF #INDvSA @mastercardindia pic.twitter.com/v2K9K1iQ0C

— BCCI (@BCCI) September 28, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1st T20
  • Arshdeep
  • Deepak Hooda
  • India vs south africa

Related News

    Latest News

    • భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!

    • ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

    • సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్

    • ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

    • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

    Trending News

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd