Gujarat Titans: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాలుగో ఓటమి.. భారీ దెబ్బ కొట్టిన సిరాజ్!
గుజరాత్ టైటాన్స్‌కు 153 పరుగుల లక్ష్యం లభించింది. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. హైదరాబాద్ బౌలింగ్‌లో మంచి ప్రారంభాన్ని సాధించింది.
- By Gopichand Published Date - 11:16 PM, Sun - 6 April 25

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతూ 152 పరుగులు చేసింది. దీనికి బదులుగా గుజరాత్ 20 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇది ఐపీఎల్ 2025లో గుజరాత్‌కు వరుసగా మూడో విజయం కాగా హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ గుజరాత్ విజయానికి కీలక పాత్ర వహించారు.
గుజరాత్ టైటాన్స్‌కు 153 పరుగుల లక్ష్యం లభించింది. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. హైదరాబాద్ బౌలింగ్‌లో మంచి ప్రారంభాన్ని సాధించింది. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ 5 పరుగులకు, జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. దీంతో గుజరాత్ కేవలం 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
Also Read: Dhoni Lost Cricket: ఎంఎస్ ధోనీపై ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
గిల్-సుందర్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర
గుజరాత్ 2 వికెట్లు 16 పరుగులకు పడిపోయాయి. ఇక్కడ నుంచి శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మొత్తం మ్యాచ్‌ను మార్చేశారు. వీరిద్దరి మధ్య 90 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇది గుజరాత్‌ను విజయం దాకా తీసుకొచ్చింది. సుందర్ వికెట్ వివాదాస్పదంగా ఉన్నప్పటికీ మహమ్మద్ షమీ అతన్ని 49 పరుగుల వద్ద అనికేత్ వర్మ చేతుల్లో క్యాచ్ ఔట్ చేశాడు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటి నుంచి చివరి వరకు క్రీజ్‌లో నిలిచి అజేయంగా 61 పరుగులతో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సుందర్ ఔట్ అయిన తర్వాత షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ కెప్టెన్ గిల్‌కు తోడయ్యాడు. రూథర్‌ఫోర్డ్ 16 బంతుల్లో 35 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు.
మహమ్మద్ సిరాజ్ విజయానికి ముఖ్య కారణం
గుజరాత్ టైటాన్స్ విజయానికి పునాది మహమ్మద్ సిరాజ్ వేశాడు. సిరాజ్ ముందు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. అతను 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, సిమర్‌జీత్ సింగ్ వికెట్లను పడగొట్టాడు. సిరాజ్‌తో పాటు గుజరాత్ తరపున ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ కూడా రెండేసి వికెట్లు తీశారు.