PAK-W vs SL-W: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక మహిళల జట్టు
మహిళల ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
- By Gopichand Published Date - 04:39 PM, Thu - 13 October 22

మహిళల ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. శ్రీలంక జట్టులో హర్షిత మాధవి (35), అనుష్క సంజీవని (26) రన్స్ చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నశ్రా సంధు మూడు వికెట్లు తీసింది.
అనంతరం 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 రన్స్ మాత్రమే చేసి 1 పరుగు తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (42), నిదా దార్ (26) రన్స్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ మహిళలు 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి ఓడిపోయారు. శ్రీలంక బౌలర్లలో రణవీర రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.
What a nail-biting finish. Incredible!
Sri Lanka are through to the final of the #AsiaCup2022 🔥#ApeKello pic.twitter.com/TUzaxDSBzb
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022