HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >South Africa Beat Bangladesh To Get Crucial Two Points

SA Beats Bangladesh: బంగ్లాను చిత్తు చేసిన సఫారీలు

తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా గెలుపు ముంగిట నిలిచిపోయిన సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో అదరగొట్టింది.

  • Author : Naresh Kumar Date : 27-10-2022 - 1:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
South Africa
South Africa

తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా గెలుపు ముంగిట నిలిచిపోయిన సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో అదరగొట్టింది. బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ పై సఫారీ టీమ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సౌతాఫ్రికా బ్యాటర్ రొస్కో సెంచరీనే హైలైట్. మొదట బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 205 పరుగుల భారీస్కోర్ చేసింది. కెప్టెన్ బవుమా 2 రన్స్ కే ఔటైనా.. మరో ఓపెనర్ డికాక్, రొస్కో రెచ్చిపోయారు. బంగ్లా బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ రెండో వికెట్ కు 13 ఓవర్లలోనే 168 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ 38 బంతుల్లో 63 రన్స్ కు ఔటైనా.. రొస్కో మాత్రం శతకం సాధించాడు. రొస్కో 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబుల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ పూర్తిగా తేలిపోయింది. ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేదు. సఫారీ పేసర్ నోర్జే , స్పిన్నర్ షంషీ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్ లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా.. లిట్టన్ దాస్ చేసిన 34 రన్స్ టాప్ స్కోర్. దీంతో బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. నోర్జే 4 వికెట్లు, షంషీ 3 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. టోర్నీలో సౌతాఫ్రికాకు ఇదే తొలి విజయం. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

🚨 RESULT | SOUTH AFRICA WIN BY 104 RUNS

The bowlers backed up the batting performance led by Rilee Rossouw's second T20I century as we grab our first win of the #T20WorldCup#SAvBAN #BePartOfIt pic.twitter.com/REqLSShBnn

— Proteas Men (@ProteasMenCSA) October 27, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • south africa
  • T20 world cup
  • World Cup 2022

Related News

Pak Vs Ban 2nd Odi

పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Salman Ali Agha Run Out Vs Bangladesh  పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న‌ ఢాకాలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘాను అనూహ్య రీతిలో రనౌట్ చేయడం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా బంగ్లాదేశ్ ఆటగాడు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జ

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd