HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Siraj Becomes New World No 1 Bowler Ahead Of Odi World Cup

Mohammad Siraj : వన్డేల్లో మళ్లీ నెంబర్ వన్‌ గా సిరాజ్‌

ఈ ప్రదర్శనతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ (Siraj) నెంబర్ వన్ కావడం ఇది రెండో సారి.

  • Author : Naresh Kumar Date : 20-09-2023 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Siraj Becomes New World No 1 Bowler Ahead Of Odi World Cup
Siraj Becomes New World No 1 Bowler Ahead Of Odi World Cup

Mohammad Siraj : అంతర్జాతీయ క్రికెట్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. ఆసియాకప్ ఫైనల్లో సంచలన ప్రదర్శనతో భారత్‌కు ట్రోఫీ అందించిన సిరాజ్ తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకిన సిరాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ (Siraj) నెంబర్ వన్ కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది జనవరిలోనూ అతను టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్‌ ముందు వరకూ ఆసీస్ పేసర్ హ్యాజిల్‌వుడ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. లంకపై ఆరు వికెట్ల ప్రదర్శనతో సిరాజ్ (Siraj) 9వ స్థానంలో నుంచి నెంబర్ వన్ ర్యాంకుకు దూసుకెళ్ళాడు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ సిరాజ్ అదరగొడుతున్నాడు. గత రెండేళ్ళ కాలంలో ఇటు టెస్టుల్లోనూ , అటు వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్న ఈ హైదరాబాదీ ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్‌గా ఉన్నాడు. గతంలో బూమ్రా గాయంతో దూరమైనప్పుడు భారత పేస్ ఎటాక్‌ను లీడ్ చేసిన సిరాజ్ (Siraj) అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకూ 29 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 53 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకపై సిరాజ్‌ది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన.

ఇదిలా ఉంటే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో హ్యాజిల్‌వుడ్ , బౌల్ట్ రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు ముజీబుర్ రహమాన్, రషీద్‌ఖాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ జాబితా టాప్ టెన్‌లో కుల్దీప్ యాదవ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ రెండో స్థానంలోనూ, సౌతాఫ్రికా బ్యాటర్ డసెన్ మూడో ర్యాంకులోనూ నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌కూ, బాబర్ అజామ్‌కు మధ్య 43 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ ఫామ్ కొనసాగిస్తే నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకునే అవకాశముంటుంది. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉండగా…ఆసీస్‌పై వన్డే సిరీస్ గెలిస్తే టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది.

Also Read:  Team India Jersey: వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ.. వీడియో..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Bowler
  • ICC
  • india
  • Mohammad Siraj
  • ODI
  • world cup
  • World No. 1

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • PM Modi

    Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

  • Womens T20 World Cup

    మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

Latest News

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd