Babar Azam: బాబర్ ఆజంకు అవమానం.. నేపాల్ జట్టులోకి కూడా తీసుకోరని కామెంట్స్..!
- By Gopichand Published Date - 10:19 AM, Wed - 3 July 24

Babar Azam: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీంతో భారత్, అమెరికాలపై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ జట్టు ఐసీసీ టీ20 టోర్నీ నుంచి నిష్క్రమించిన మరుక్షణం నుంచే టీమ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాగా బాబర్ ఆజం విషయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఏం విమర్శలు చేశాడో చూద్దాం.
‘నేపాల్ జట్టులోకి కూడా ఎంపిక చేయరు’
బాబర్ ఆజం పాకిస్థాన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పరిగణిస్తారు. అయితే మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఆజం ఫిట్‌గా లేడని విమర్శించాడు. నేపాల్ జట్టు కూడా అతన్ని ఎంపిక చేయదు. టీ20ల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లలో బాబర్ ఆజం సరిపోతాడా? టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్‌ల ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి చోటు దక్కుతుందా? అని విమర్శించాడు.
Also Read: IND vs ZIM: జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు భారత్ జట్టు ఇదే..!
టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యేక ప్రదర్శన చేయలేదు
ఈ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. అతని స్ట్రైక్ రేట్‌పై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా అతని కెప్టెన్సీపై కూడా పలు విమర్శలు వచ్చాయి. జట్టు ఎంపిక విషయంలో కూడా బాబర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు నిష్క్రమణ తర్వాత జరిగింది.
We’re now on WhatsApp : Click to Join
టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు
ODI ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ అజామ్ మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అయితే, ఆ తర్వాత కొత్త పీసీబీ చైర్మన్ అతడిని మళ్లీ కెప్టెన్‌గా నియమించారు. ఆజం కంటే ముందు షహీన్ షా ఆఫ్రిది జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.