Sheetal Devi: పారిస్ పారాలింపిక్స్.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ శీతల్ దేవి..!
భారత పారా అథ్లెట్ శీతల్ దేవి 703 పాయింట్ల రికార్డును టర్కీ క్రీడాకారిణి క్యురి గిర్డి బద్దలు కొట్టింది. 704 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది.
- By Gopichand Published Date - 12:46 AM, Fri - 30 August 24

Sheetal Devi: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పారాలింపిక్స్ కూడా ప్రారంభమయ్యాయి. పారాలింపిక్స్‌లో తొలిరోజే భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి చరిత్ర సృష్టించింది. కాంపౌండ్ ఆర్చరీలో అత్యధిక స్కోరు సాధించిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది. కాంపౌండ్ ఆర్చరీకి అర్హత రౌండ్‌కు ముందు ప్రపంచ రికార్డు 698 పాయింట్లు. ఈ రికార్డును గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఫోబ్ పైన్ ప్యాటర్సన్ సృష్టించింది. మహిళల సింగిల్స్ కాంపౌండ్ ఆర్చరీ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత క్రీడాకారిణి శీతల్ దేవి 703 పాయింట్లు సాధించి ఈ రికార్డును బద్దలు కొట్టింది.
పారిస్ పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు భారత పారా అథ్లెట్ శీతల్ దేవి (Sheetal Devi) గురువారం చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ క్వాలిఫికేషన్‌లో ఆమె అద్భుత ప్రదర్శన చేసి 720కి 703 పాయింట్లు సాధించి క్వార్టర్‌ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో 703 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు 698 పాయింట్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అయితే ఆమె ఈ ప్రపంచ రికార్డు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. దానిని టర్కీకి చెందిన క్యూరీ గిర్డి బద్దలు కొట్టింది.
భారత పారా అథ్లెట్ శీతల్ దేవి 703 పాయింట్ల రికార్డును టర్కీ క్రీడాకారిణి క్యురి గిర్డి బద్దలు కొట్టింది. 704 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. తదుపరి రౌండ్‌లో ఆమెకి బై లభించింది. ఇప్పుడు ఆమె ఆగస్టు 31 రాత్రి 9 గంటల ప్రాంతంలో తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే చరిత్ర సృష్టించిన శీతల్ అంతకుముందే మరో చరిత్ర సృష్టించి ప్రపంచ దేశాల్లో భారత్ పేరును సగర్వంగా నిలబెట్టింది. గతేడాది చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో కేవలం ఒక సీజన్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా శీతల్ నిలిచింది. దీంతో పాటు రజత మెడల్ కూడా సాధించింది.
We’re now on WhatsApp. Click to Join.
సరిత కూడా ప్రీక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది
ఈ పారాలింపిక్స్‌లో భారతదేశానికి చెందిన సరిత కూడా పాల్గొన్నారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 682 పాయింట్లు సాధించింది. ఆమె 9వ స్థానంలో నిలిచారు. ఆగస్టు 30న ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరేందుకు సరిత ఆడనుంది.