Shamar Joseph : రెండేళ్ల క్రితం సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు స్టార్ బౌలర్
Shamar Joseph : వెస్టిండీస్ క్రికెట్ టీమ్ 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టీమ్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించింది.
- Author : Pasha
Date : 30-01-2024 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Shamar Joseph : వెస్టిండీస్ క్రికెట్ టీమ్ 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టీమ్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ఈ సక్సెస్‌ను విండీస్‌కు అందించింది ఎవరో తెలుసా ? ఫాస్ట్ బౌలర్ షమార్ జోసెఫ్ !! 24 ఏళ్ల షమార్ బౌలింగ్ ఫీట్లకు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో శనివారం బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ వేసిన యార్కర్ తాకి షమార్ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడి.. తర్వాతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొని గ్రౌండ్‌లోకి వచ్చాడు. 11.5 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓటమికి బాటలు వేశాడు. 216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. షమార్ జోసెఫ్ అద్భుత బౌలింగ్ కారణంగా 207 రన్స్‌కే ఆలౌటైంది. 8 పరుగుల స్వల్ప తేడాతో విండీస్ చారిత్రక విజయం సాధించింది. దీంతో షమార్‌పై(Shamar Joseph) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
షమార్ జోసెఫ్ కెరీర్ గ్రాఫ్
- గయానా దీవుల్లోని ఓ పేద కుటుంబంలో షమార్ జన్మించాడు.
- 2018 ముందు వరకు షమార్ వాళ్ల ఊరిలో ఫోన్లు, ఇంటర్నెట్ లేవు.
- షమార్ వాళ్ల ఊరి నుంచి సమీప పట్టణానికి వెళ్లాంటే పడవలే దిక్కు.
- షమార్ తన టీనేజీలో చెట్ల మొద్దులు నరికే పనికి వెళ్లేవాడు.
- చిన్న వయసులోనే షమార్‌కు పెళ్లయింది.
- పెళ్లి తర్వాత ఫ్యామిలీని పోషించడం కోసం పట్టణానికి వలస వెళ్లి అక్కడ ఓ నిర్మాణ సంస్థలో కూలీగా చేరాడు.
- అనంతరం అదే పట్టణంలో సెక్యూరిటీ గార్డు జాబ్ కూడా షమార్ చేశాడు. 2021 వరకు కూడా సెక్యూరిటీ గార్డు జాబ్‌ను అతడు చేయడం గమనార్హం.
- చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తితో షమార్ ఫాస్ట్‌బౌలింగ్‌లో నైపుణ్యం సంపాదించాడు. వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయంతో అతడు గయానా జట్టు కోచ్ దృష్టిలో పడ్డాడు.
- సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ ప్రతిభ చాటుకుని డివిజన్-1 క్రికెట్లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీశాడు.
- ఆ తర్వాత కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా షమార్‌కు ఛాన్స్ దక్కింది. ఆ టైంలోనే దిగ్గజ విండీస్ బౌలర్ ఆంబ్రోస్.. షమార్ బౌలింగ్ చూసి మెచ్చుకున్నాడు.
- 2023 ఫిబ్రవరిలో గయానా తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని షమార్ పొందాడు.
- గత ఏడాది కరీబియన్ లీగ్‌లో నిలకడగా అతడు రాణించారు.
- ఇటీవలే వెస్టిండీస్ జాతీయ జట్టుకు షమార్ ఎంపికయ్యాడు.