Rohit Sharma: రోహిత్ పై సంజు శాంసన్ కామెంట్స్
టీమిండియాలో సంజూ శాంసన్ క్రికెట్ కెరీర్ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అవకాశాలు ఎంత వేగంగా వస్తాయో అంతకు మించి స్పీడులో చేజారుతాయి. ప్రతి ఐపీఎల్ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జాతీయ జట్టులోకి వస్తాడు
- Author : Praveen Aluthuru
Date : 25-11-2023 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: టీమిండియాలో సంజూ శాంసన్ క్రికెట్ కెరీర్ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అవకాశాలు ఎంత వేగంగా వస్తాయో అంతకు మించి స్పీడులో చేజారుతాయి. ప్రతి ఐపీఎల్ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జాతీయ జట్టులోకి వస్తాడు. ఆ తర్వాత ఒకటి, రెండు మ్యాచుల్లో విఫలమవుతాడు. వెంటనే సెలక్టర్లు అతడిపై వేటు వేస్తారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తనకి ఎల్లప్పుడూ సపోర్టుగా నిలుస్తాడని సంజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ భాయ్ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందన్నాడు. రోహిత్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని సంజు తెలిపాడు. తన దగ్గరకు వచ్చి అప్యాయంగా మాట్లాడే వ్యక్తుల్లో రోహిత్ మొదటి స్ధానంలో ఉంటాడని తెలిపాడు. తన బ్యాటింగ్ స్టైల్ బాగుంటుందని రోహిత్ ఓ సారి అన్నట్లు గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌పై అలా సిక్సర్లు ఎలా కొడుతున్నావని రోహిత్ నవ్వుతు అన్న మాటల్ని తాజాగా ఓ ఇంటర్వూలో సంజూ శాంసన్ గుర్తు చేసుకున్నాడు.
Also Read: Israel Hamas War: హమాస్ విడుదల చేసిన బందీల జాబితా విడుదల