HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Pak Team India Crushed Pakistan By 8 Wickets

పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భార‌త్‌!

ఈ విజయంతో భారత జట్టు 2 పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌కు కూడా సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్-రేట్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది.

  • Author : Gopichand Date : 15-02-2026 - 7:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs PAK
IND vs PAK

IND vs PAK: భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా కేవలం 11వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భారత బ్యాటర్లు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఫిబ్రవరి 13న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది మొదటి విజయం. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు యూఏఈ చేతిలో ఓటమి పాలవ్వగా, ఇప్పుడు పాకిస్థాన్‌ను ఓడించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.

Also Read: Gold Crash: లక్ష రూపాయలకే తులం బంగారం !! ఏంటి నిజమా ?

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. ఓపెనర్ హుమైరా కాజీ ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయింది. అయితే మరో ఓపెనర్ బృందా దినేష్ బ్యాట్‌తో విరుచుకుపడింది. కేవలం 25 బంతుల్లోనే ఆమె తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. మొత్తంగా 29 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అనుష్క శర్మ 24 పరుగులు చేయగా, తేజల్ హసబ్నిస్ 5 బంతుల్లో 12 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. టీమ్ ఇండియా బౌలర్లందరూ దాదాపు 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చి పాకిస్థాన్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.

సెమీఫైనల్ దిశగా భారత్

ఈ విజయంతో భారత జట్టు 2 పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌కు కూడా సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్-రేట్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకోవాలంటే భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 17న నేపాల్‌తో తలపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup Rising Star
  • ind vs pak
  • IND-W
  • Pak- W
  • sports news
  • team india

Related News

BCCI Releases Team India 2026-27 Schedule

BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్‌ విడుదల

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున

  • Yash Dayal

    ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

  • BCCI Rules

    ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

  • Rajasthan Royals

    రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

  • BCCI Rules

    ఐపీఎల్ 2026.. పూర్తి షెడ్యూల్ విడుద‌ల ఎప్పుడంటే?

Latest News

  • Ads : ఇకపై రైల్వే స్టేషన్ లలో ఈ యాడ్స్ కనిపించవు !!

  • Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!

  • Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

  • Husband Health : మీ భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాల్సిందే !!

  • TVK Party : కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd