Rohit Sharma : టీం ఇండియా ఓటమి పై రోహిత్ కామెంట్స్
Rohit Sharma : బుమ్రా ప్రదర్శన అద్భుతమని, సెంచరీ హీరో నితీశ్ రెడ్డి కి మంచి కెరీర్ ఉందని కొనియాడారు
- Author : Sudheer
Date : 30-12-2024 - 1:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఆస్ట్రేలియా(Australia )తో జరిగిన నాలుగో టెస్టులో భారత్(India ) 184 పరుగుల భారీ తేడాతో ఓటమిని (Australia beat India by 184 runs) చవిచూసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో చేతులారా విజయాన్ని చేజార్చుకుంది. ఈ ఓటమి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) రియాక్ట్ అయ్యారు. బాక్సింగ్ డే టెస్టులో ఓటమి నిరాశపరిచిందని రోహిత్ శర్మ పేర్కొన్నారు. బుమ్రా ప్రదర్శన అద్భుతమని, సెంచరీ హీరో నితీశ్ రెడ్డి కి మంచి కెరీర్ ఉందని కొనియాడారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా కొన్ని ఫలితాలు నిరాశపరిచాయని , 340 రన్స్ టార్గెట్ ఈజీ కాదని, జట్టుగా కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందన్నారు. సిడ్నీలో జరిగే ఐదో టెస్టు తమకో అవకాశమని, మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చాడు.
ఇక అభిమానులు మాత్రం భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం ఈ ఓటమికి ప్రధాన కారణం అని అంటున్నారు. రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ కూడా నిలదొక్కుకోలేకపోవడం వల్ల భారత్ విజయం సాధించే అవకాశం కోల్పోయింది అని పేర్కొంటున్నారు. చివరికి యశస్వి జైశ్వాల్ కూడా అవుట్ కావడంతో భారత్ ఆశలు పూర్తిగా వదిలేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి తన తొలి టెస్ట్ సెంచరీ చేయడం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే వెనుదిరిగాడు. చివరి టెస్ట్‌లో విజయంతో సిరీస్‌ను సమం చేసే ప్రయత్నం చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా