Rohit Sharma: 2023 వరల్డ్ కప్ పండుగలాంటిది
అక్టోబర్ 8న ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్ ని ప్రారంభించనుంది. మూడో వన్డే ప్రపంచకప్‌తో పాటు
- By Praveen Aluthuru Published Date - 07:02 PM, Tue - 27 June 23

Rohit Sharma: అక్టోబర్ 8న ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ ప్రపంచకప్ ని ప్రారంభించనుంది. మూడో వన్డే ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో రెండో టైటిల్‌ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తుంది. భారత్ తన తొమ్మిది లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, లక్నో మరియు బెంగళూరుతో సహా వివిధ వేదికలలో ఆడుతుంది. కాగా, షెడ్యూల్ ప్రకటన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ ప్రపంచకప్ చాలా కఠినంగా మరియు ఉత్కంఠభరితంగా సాగుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు.
రోహిత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ప్రపంచ కప్ పండుగ లాంటిది. ఈ ప్రపంచకప్‌లో అభిమానులు అద్భుతమైన మ్యాచ్‌లను చూడనున్నారని అన్నాడు. కాగా భారత్ ధోని సారధ్యంలో చివరిగా 2011లో భారత్ ప్రపంచకప్ గెలుచుకుంది. ఈ ప్రపంచకప్ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆస్ట్రేలియా తర్వాత భారత్ తన తదుపరి మ్యాచ్‌ని అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది.
Read More ICC World Cup 2023: ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు.. రెండు మ్యాచ్‌లు ఆడనున్న పాకిస్థాన్ జట్టు