Rohit Sharma: రోహిత్ శర్మ భార్య రితికాకు ఇలా ప్రపోజ్ చేశాడు, క్రికెట్ గ్రౌండ్‌లో రొమాంటిక్ ప్లాన్
టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా, అతనికన్నా ముందు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు.
- By Hashtag U Published Date - 06:58 PM, Sun - 22 June 25

ముంబై: (Rohit Sharma Romance) టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేకు చేసిన ప్రేమ ప్రపోజల్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఇది అతని చిన్నతనంలో ఆటలాడిన క్రికెట్ మైదానంలోనే జరిగిందని చెప్పారు.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, అతని భార్య గీతా బస్రాతో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, ‘‘”ఐస్ క్రీం తిందాం పద”’’ అని చెప్పి రితికాను తన మైదానానికి తీసుకెళ్లానని తెలిపారు. అప్పటికే అక్కడ తన స్నేహితులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మైదానం చీకటిగా ఉండటంతో రితికాకు అది మైదానం అనిపించలేదు. పిచ్ మధ్యలో మోకాలిపై కూర్చుని ప్రేమగా ప్రపోజ్ చేశానని రోహిత్ గుర్తు చేశారు. ఈ క్షణాన్ని ఆయన స్నేహితులు కెమెరాలో బంధించారు.
Also Read:Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు!
ఇటీవల రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా, అతనికన్నా ముందు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ ఇద్దరూ గతేడాది దక్షిణాఫ్రికాపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కూడా రిటైరయ్యారు.