ICC World Cup 2023 Semifinal : వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమా..రోహిత్ శర్మ ఏమన్నాడంటే ?
ప్రభావం పెద్దగా ఉండదని వ్యాఖ్యానించాడు. ఇక్కడ తాను చాలా క్రికెట్ ఆడాననీ,. గత 4-5 మ్యాచ్‌ల్లో వాంఖడే స్వభావం బయట పడలేదన్నాడు
- By Sudheer Published Date - 11:31 PM, Tue - 14 November 23

వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023 ) తొలి సెమీస్ (Semifinal) కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. అంచనాలకు తగ్గట్టే అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ కు చేరిన భారత్ (India ) ఆడిన 9 మ్యాచ్ లలోనూ గెలిచింది. ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ కు ఇంకా రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) సెమీస్ లో తలపడనున్నాయి. గత రికార్డుల్లో వరల్డ్ కప్ వరకూ భారత్ పై కివీస్ దే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాంఖడే పిచ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకూ ఈ ప్రపంచకప్ లో ఇక్కడ జరిగిన మ్యాచ్ లలో పరుగుల వరద పారింది.
We’re now on WhatsApp. Click to Join.
వాంఖడే పిచ్ (Wankhede Pitch) ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు యావరేజ్ స్కోర్ 357. తాజా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 399 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం రెడ్ సాయిల్ పిచ్‌లనే ఉపయోగించారు. ఈ పిచ్‌పై పేసర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో టాస్ కీలకం కానుందని అంచనా వేస్తున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం టాస్ పై భిన్నంగా స్పందించాడు. టాస్ ప్రభావం పెద్దగా ఉండదని వ్యాఖ్యానించాడు. ఇక్కడ తాను చాలా క్రికెట్ ఆడాననీ,. గత 4-5 మ్యాచ్‌ల్లో వాంఖడే స్వభావం బయట పడలేదన్నాడు. పిచ్ ఎలా ఉంటుందనే దానిపై తాను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదన్నాడు. ఇక్కడ జరిగిన 27 మ్యాచ్‌లలో ముందు బ్యాటింగ్ చేసిన జట్లు 14 సార్లు విజయం సాధించాయి. లక్ష్యఛేదనలో 13 సార్లు గెలుపొందాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత ఫామ్ , బలబలాల ప్రకారం చూస్తే టీమిండియానే ఫేవరెట్. అటు కివీస్ ను కూడా తేలిగ్గా తీసుకోలేం. 2019 ప్రపంచకప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also : Ajay : పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాక.. నాకు బయట గౌరవం లభించింది..