Rohit Sharma: రోహిత్ @ 10000… హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
ఆసియా కప్ వేదికగా వరల్డ్ క్రికెట్ లో భారత ఆటగాళ్ళ రికార్డుల పరంపర కొనసాగుతోంది. పాక్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శతక్కొట్టడమే కాదు 13 వేల పరుగుల క్లబ్ లో చేరాడు
- Author : Praveen Aluthuru
Date : 12-09-2023 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: ఆసియా కప్ వేదికగా వరల్డ్ క్రికెట్ లో భారత ఆటగాళ్ళ రికార్డుల పరంపర కొనసాగుతోంది. పాక్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శతక్కొట్టడమే కాదు 13 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. తాజాగా రోహిత్ శర్మ కూడా రికార్డుల జోరు కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఏడో ఓవర్ ఐదో బంతిని రోహిత్ భారీ సిక్సర్‌గా మలిచి 10 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. రోహిత్ అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మైలు రాయి అందుకోగా.. రోహిత్ 241 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు, సౌరవ్ గంగూలీ 263 ఇన్నింగ్స్‌లు, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల జాబితాకు సంబంధించి భారత్ తరపున రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు.
పాక్ తో మ్యాచ్ లో నిరాశ పరిచిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో రాణించాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత ఆసియాకప్‌లో రోహిత్ శర్మకు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ పలు రికార్డులు అందుకున్నాడు.10 వేల పరుగుల మైలురాయికి సంబంధించి అత్యుతమ యావరేజ్ విషయంలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. 57.62 సగటుతో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా.. 50.57 సగటుతో ధోనీ నిలిచాడు. ఇక రోహిత్ 49.02తో ఈ క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. కాగా కోహ్లీ-రోహిత్ వన్డేలో అత్యంత వేగంగా 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా కూడా ఘనత సాధించింది.
Also Read: IND vs SL: టీమిండియాను వణికించేసిన దునిత్.. లంక టార్గెట్ 214