IND vs SL: టీమిండియాను వణికించేసిన దునిత్.. లంక టార్గెట్ 214
పాకిస్థాన్‌పై 229 పరుగుల భారీ విజయాన్నందుకున్న టీమిండియా 15 గంటల వ్యవధిలోనే శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ లో తలపడింది.
- By Praveen Aluthuru Published Date - 07:52 PM, Tue - 12 September 23

IND vs SL: పాకిస్థాన్‌పై 229 పరుగుల భారీ విజయాన్నందుకున్న టీమిండియా 15 గంటల వ్యవధిలోనే శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ లో తలపడింది. ఆసియా కప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో లంక బౌలర్లు సత్తా చాటారు. శ్రీలంక స్పిన్ మాయకి భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దాంతో ఇండియా 213 పరుగులకే ఆలౌటయ్యింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 53 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. గత మ్యాచ్ లో అద్భుత సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో కేవలం 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 33 పరుగులు రాబట్టాడు. ఓ దశలో టీమిండియా స్కోర్ 200 దాటుతుందో లేదన్న పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. 49వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడిన అక్షర్ పటేల్ బౌండరీ వద్ద సమరవిక్రమ చేతికి చిక్కాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.ఇన్నింగ్స్ లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే భారత్ ఆటగాళ్లను తన ఉచ్చులో పడేశాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో 5 వికెట్లను తీసుకున్నాడు. చరిత అసలంక 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: D Srinivas: ఆందోళనకరంగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి