HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Eye On Chris Gayle Sixes Record Need Just Two Sixes

Rohit sharma sixes record : మూడో వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డు.. మ‌రో రెండు సిక్స‌ర్లు బాదితే..

మూడో వ‌న్డే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

  • Author : News Desk Date : 06-08-2024 - 1:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Most Sixes In Cricket
Most Sixes In Cricket

శ్రీలంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ ప్ర‌స్తుతం 0-1తేడాతో వెనుక‌బ‌డి ఉంది. బుధ‌వారం కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త జ‌ట్టు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. కాగా.. ఈ మూడో వ‌న్డే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో వ‌న్డేలో గ‌నుక హిట్‌మ్యాన్ రెండు సిక్స‌ర్లు బాదితే.. వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

ఈ క్ర‌మంలో వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేయ‌నున్నాడు. 294 ఇన్నింగ్స్‌ల్లో గేల్ 331 సిక్స‌ర్లు కొట్టాడు. ప్ర‌స్తుతం రోహిత్ 256 ఇన్నింగ్స్‌ల్లో 330 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గ‌జ ఆట‌గాడు షాహిద్ అఫ్రిది అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 369 ఇన్నింగ్స్‌ల్లో అప్రిది 351 సిక్స‌ర్లను బాదాడు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 369 ఇన్నింగ్స్‌లో 351 సిక్స‌ర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్స‌ర్లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 256 ఇన్నింగ్స్‌ల్లో 330 సిక్స‌ర్లు
స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక) – 433 ఇన్నింగ్స్‌ల్లో 270 సిక్స‌ర్లు
మ‌హేంద్ర సింగ్ ధోని (భార‌త్‌) – 297 ఇన్నింగ్స్‌ల్లో 229 సిక్స‌ర్లు

ఛేద‌న‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల వీరుడిగా..

వ‌న్డేల్లో ల‌క్ష్య ఛేద‌న‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డేల్లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలో అత‌డు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ 177 సిక్స‌ర్లు బాద‌గా రోహిత్ శ‌ర్మ 179 సిక్స‌ర్లు కొట్టాడు. ఆ త‌రువాతి స్థానాల్లో అఫ్రిది, జ‌య‌సూర్య లు ఉన్నారు. ఇక రెండో వ‌న్డేల్లో రోహిత్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 64 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ధాటిగా ఆడిన‌ప్ప‌టికి కూడా భార‌త్ ఓడిపోయింది.

ల‌క్ష్య ఛేద‌న‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల వీరులు..
రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 179 సిక్స‌ర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 177 సిక్స‌ర్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 166 సిక్స‌ర్లు
స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక) – 109 సిక్స‌ర్లు
మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) – 103 సిక్స‌ర్లు

ALSO READ : Vinod Kambli : న‌డ‌వ‌లేని స్థితిలో స‌చిన్ స్నేహితుడు.. ఇత‌డు మాజీ భార‌త స్టార్ ఆట‌గాడు కూడా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chris Gayle
  • Ind vs SL 3rd ODI
  • Most Sixes in ODI's
  • rohit sharma
  • team india

Related News

WTC Points Table

టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇంగ్లండ్ జట్టు 352 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

  • Rohit Sharma

    విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

  • Year Ender 2025

    2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

  • Ind Vs Sa 5th T20..

    భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

  • Varun Chakravarthy

    చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

Latest News

  • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

  • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

  • వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • బొత్స ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd