Mumbai Indians: ముంబైకి తొలి విజయం దక్కేనా ?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఏప్రిల్ 13న మరో హోరాహోరీ మ్యాచ్ జరుగనుంది.
- By Balu J Published Date - 05:49 PM, Wed - 13 April 22
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఏప్రిల్ 13న మరో హోరాహోరీ మ్యాచ్ జరుగనుంది. పుణెలోని ఎంసీఏ మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. బుధవారం రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచు లో కూడా ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో నాలుగింట్లో ఓటమిపాలై అభిమానుల్ని తీవ్ర నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
ఇక ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో జానీ బెయిర్‌స్టో మిడిల్ ఆర్డర్ లోలియామ్ లివిన్స్టోన్ , షారుక్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికొస్తే.. కగిసో రబడ, రాహుల్ చాహర్, వరుణ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ లోయర్ ఆర్డర్ లో కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్ బ్యాటింగ్ కు రానున్నారు.
ఇక ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ విభాగం విషయానికొస్తే..మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ జరగనున్న ఎంసీఏ పిచ్ అటు బ్యాటింగ్ కు ఇటు బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
Related News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.