Rohit reveals reasons: ఓపెనర్ గా గిల్.. రోహిత్ ఏమన్నాడంటే..?
శ్రీలంకతో వన్డే సిరీస్ కి సీనియర్లు జట్టులోకి తిరిగి రావటంతో ఫైనల్ ఎలెవన్ ఆసక్తికరంగా మారింది. హిట్ మ్యాన్ ఎంట్రీతో ఓపెనర్ గా ఎవరు దిగుతారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్ (Gill) అని రోహిత్ శర్మ (Rohit) స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినా.. అతన్ని జట్టులో ఆడించే పరిస్థితి లేదన్నాడు.
- Author : Gopichand
Date : 10-01-2023 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీలంకతో వన్డే సిరీస్ కి సీనియర్లు జట్టులోకి తిరిగి రావటంతో ఫైనల్ ఎలెవన్ ఆసక్తికరంగా మారింది. హిట్ మ్యాన్ ఎంట్రీతో ఓపెనర్ గా ఎవరు దిగుతారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్ (Gill) అని రోహిత్ శర్మ (Rohit) స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినా.. అతన్ని జట్టులో ఆడించే పరిస్థితి లేదన్నాడు. వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడం ఎంత గొప్ప తనకు బాగా తెలుసనీ. కానీ దురదృష్టవశాత్తు ఇషాన్ కిషన్‌ను ఆడించలేని పరిస్థితి ఉందన్నాడు శుభ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇవ్వడం న్యాయమేననీ చెప్పుకొచ్చాడు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ వన్డేల్లో సత్తా చాటాడనీ, ఇషాన్ కిషన్ కూడా రాణించినప్పటికీ దురదృష్టవశాత్తు అతన్ని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదని , వేచి చూడాలని రోహిత్ చెప్పాడు.
Also Read: South Africa T20 League: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. పూర్తి వివరాలివే..!
ఇదిలా ఉంటే సిరీస్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాను తప్పించడానికి గల కారణాన్ని కూడా రోహిత్ వెల్లడించాడు. ఎన్‌సీఏలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా వెన్నులో పట్టేసిందని, దాంతోనే అతన్ని తప్పించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, చిన్న గాయమేనని స్పష్టం చేశాడు. బుమ్రానే అసౌకర్యంగా ఉన్నానని చెప్పినప్పుడు పక్కనపెట్టకుండా ఎలా ఉంటామన్నాడు. బుమ్రా చాలా కీలకమైన బౌలరని, అతని గాయాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు.