HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ricky Ponting Steps Down As Dc Head Coach

Ricky Ponting: రికీ పాంటింగ్‌కు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. త‌దుప‌రి కోచ్‌గా గంగూలీ..?

IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన తర్వాత జ‌ట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) విమర్శలకు గురయ్యాడు.

  • Author : Gopi Date : 14-07-2024 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ricky Ponting
Ricky Ponting

Ricky Ponting: IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన తర్వాత జ‌ట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) విమర్శలకు గురయ్యాడు. శనివారం ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ సమాచారాన్ని ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియన్ లెజెండ్ గత ఏడేళ్లుగా జట్టులో భాగంగా ఉన్నాడు. ఫ్రాంచైజీలో సుదీర్ఘకాలం కొనసాగారు. పాంటింగ్ ఎన్నడూ జట్టును టైటిల్ గెలవలేకపోయాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌లో చోటు కోల్పోయింది.

ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది

రికీ పాంటింగ్‌ను చీఫ్ కోచ్ పదవి నుంచి తొలగించిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “7 సీజన్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. కోచ్! మీరందించిన సేవ‌ల‌కు ధన్యవాదాలు” అని ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. అయితే పాంటింగ్ కోచింగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌క‌పోవ‌టంతో పాంటింగ్‌పై వేటు త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది.

Also Read: Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆట‌గాడు..? బీసీసీఐదే నిర్ణ‌యం..!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్‌కు ఢిల్లీతో చాలా ఏళ్ల‌ అనుబంధం ఉంది. పాంటింగ్ 2018 నుండి ఇప్పటివరకు నిరంతరం ఢిల్లీతోనే కలిసి పనిచేశారు. పాంటింగ్ కోచింగ్‌లో చాలా మంది ఢిల్లీ యువ ఆటగాళ్ల ఆట మెరుగుపడింది. అతని కోచింగ్‌లో ఢిల్లీ 2022లో ఫైనల్స్‌కు వెళ్లింది. ఫైనల్లో ఢిల్లీని 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడించింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి ద‌క్కిన అత్యుత్తమ స్థానం అదొక్క‌టే.

We’re now on WhatsApp. Click to Join.

గంగూలీ కోచ్‌ పదవిని స్వీకరిస్తారా?

రికీ పాంటింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఎవరిని నియమిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. సౌరవ్ గంగూలీకి ఈ బాధ్యతను అప్పగించవచ్చని నివేదికలలో పేర్కొన్నారు. పాంటింగ్ హయాంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో సలహాదారుగా వ్యవహరించిన భారత మాజీ కెప్టెన్ గంగూలీ, ఆస్ట్రేలియన్ కోచ్‌ను తొలగించిన తర్వాత ఖాళీ అయిన పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఫ్రాంఛైజీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • Indian Premier League (IPL)
  • ipl 2024
  • ricky ponting
  • sourav ganguly

Related News

Rcb Green Jersey

IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి, 8 సార్లు ఓటమిపాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో చిన్నస్వామి స్టేడియంలోని వేడి, ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd