HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Reason Why Virat Kohli Didnt Leave Rcb

Kohli and RCB: కోహ్లీ ఆర్సీబిని వీడకపోవడానికి కారణమేంటో తెలుసా ?

ఐపీఎల్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 2013 సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

  • Author : Naresh Kumar Date : 06-05-2022 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat
Virat

ఐపీఎల్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 2013 సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్ ముగిసైనా తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్ ముంగిట ఆర్సీబీ యాజమాన్యం దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను సారథిగా ఎంపిక చేసింది . ఇక ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 15 సీజన్ల పాటు ఆర్సీబీకి మాత్రమే ప్రాతినిధ్యం వహించి, ఐపీఎల్‌ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కని ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. తనకు ఇతర ఫ్రాంఛైజీల నుంచి చాలాసార్లు ఆఫర్లు వచ్చాయని తాజాగా చెప్పుకొచ్చాడు.

నిజాయితీగాచెప్పాలంటే నా పేరును వేలంలో నమోదు చేసుకోవాలని చాలా ఫ్రాంచైజీలు అడిగాయి. నేను కూడా వేలంలోకి వెళ్తే బావుంటుందని అనుకున్నాను. దాని గురించి ఓసారిబాగా ఆలోచించాను.. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఆర్సీబీ నన్ను చాలా నమ్మింది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఏదేమైనా బెంగళూరు జట్టుపై ఉన్న ప్రేమే తనని వేరే జట్లలోకి వెళ్లకుండా చేసిందని అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే ఐపీఎల్​లో ట్రోఫీ గెలవలేదనే అంశాన్ని తాను పెద్దగా పట్టించుకోనని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక 2008 నుంచి 2012 దాకా ఆర్సీబీలో సాధారణ ఆటగాడిలా కొనసాగిన కోహ్లి.. 2013 నుంచి 2021 సీజన్‌ వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సీజన్‌ తర్వాత కెప్టెన్సీని వదులుకున్న కోహ్లిని.. ఆర్సీబీ 15వ సీజన్ కోసం 15 కోట్లకు డ్రాఫ్ట్‌ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. చెన్నైపై విజయం సాధించిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • royal challengers bangalore
  • virat kohli

Related News

Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Virat Kohli Injury

    ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?

Latest News

  • చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd