RCB Patidar: రజత్ పటీదార్ రికార్డుల మోత
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ దశలోనూ ప్రేక్షకులను సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో రెండు జట్లు భారీ స్కోర్లు చేయగా.. చివరకు లక్నోపై బెంగళూరు జట్టే విజయం సాధించింది.
- Author : Naresh Kumar
Date : 26-05-2022 - 4:49 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ దశలోనూ ప్రేక్షకులను సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో రెండు జట్లు భారీ స్కోర్లు చేయగా.. చివరకు లక్నోపై బెంగళూరు జట్టే విజయం సాధించింది. ఆర్సీబీ ఆటగాడు రజత్ పటీదార్ అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు 54 బంతుల్లో 112 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రజత్ అరుదైన రికార్డులను సొంతం నెలకొల్పాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో సెంచరీ చేసిన తొలి అన్ క్యాప్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో మనీశ్ పాండే పేరిట ఈ రికార్డు ఉండేది. అతడు 2014 ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున 50 బంతుల్లో 94 పరుగులు చేశాడు.
పటీదార్ 49 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా శతకం సాధించిన ఇతడు సంయుక్తంగా వృద్ధిమాన్ సాహాతో పంచుకున్నాడు. సాహా 2014 ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన మూడో అన్ క్యాప్‌డ్ ఆటగాడిగానూ రజత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత సీజన్‌లో ఆర్సీబీపై రాజస్థాన్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ చేసిన 101 పరుగుల రికార్డును రజత్ బ్రేక్ చేశాడు. ఈ రికార్డులో మనీశ్ పాండే రెండో స్థానంలో ఉండగా.. పాల్ వాల్తే అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఓ ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఐదో సారి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన వారిలో రజత్ నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే దినేశ్ కార్తీక్-రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి డెత్ ఓవర్లలో 88 పరుగులు సాధించారు. ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. మొత్తం మీద రీ ప్లేస్ మెంట్ ప్లేయర్ గా వచ్చిన రజత్ పటీదార్ కీలక మ్యాచ్ లో శతకం సాధించి హీరోగా మారిపోయాడు.