RCB @ IPL: RCB పై విండీస్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2022 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీ ఆరంభంలో వరుస విజయాల్ని సాధించినప్పటికీ ఆ తరువాత వరుస పరాజయాలను చవిచూస్తోంది.
- By Naresh Kumar Published Date - 10:31 PM, Thu - 28 April 22

ఐపీఎల్-2022 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీ ఆరంభంలో వరుస విజయాల్ని సాధించినప్పటికీ ఆ తరువాత వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్చులాడి 5 విజయాలు సాధించిన ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అయితే తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన ఆర్సీబీ జట్టు ఇక తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. ఇలాంటి చెత్త ప్రదర్శనతో ఆటతీరుతో ప్లే ఆఫ్ కు చేరడం కష్టమని, మళ్ళీ గెలుపు బాట పట్టాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం ఆర్సీబీ నాసిరకం ఆటతీరును తెలియజేస్తుందని ఇయాన్ బిషప్ అన్నాడు. విరాట్ కోహ్లీ ఇకనైనా ఫామ్ అందుకోవాల్సిన అవసరముందని అతను రాణిస్తేనే ఆర్సీబీ టోర్నీలో ముందుకెళ్తుందని పేర్కొన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకునే వరకు అతని డుప్లెసిస్ , మ్యాక్స్ వెల్ ఈ అతనిపై ఒత్తిడి తగ్గించే విధంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే తాజా సీజన్ లో ఐదుసార్లు టైటిల్ విన్నర్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా.. గతేడాది టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఎనిమిదింటిలో కేవలం 3 మ్యాచుల్లో గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది.