Ravindra Jadeja Instagram: వైరల్ గా మారిన జడేజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్
ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన జడేజా తన ఇన్నింగ్స్‌ను, టైటిల్‌ను మాహీకి అంకితం చేశాడు. ఐపీఎల్ 2023 చివరి రెండు బంతుల్లో జడేజా ఒక సిక్సర్ మరియు ఒక ఫోర్
- Author : Praveen Aluthuru
Date : 31-05-2023 - 4:32 IST
Published By : Hashtagu Telugu Desk
Ravindra Jadeja Instagram: ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన జడేజా తన ఇన్నింగ్స్‌ను, టైటిల్‌ను మాహీకి అంకితం చేశాడు. ఐపీఎల్ 2023 చివరి రెండు బంతుల్లో జడేజా ఒక సిక్సర్ మరియు ఒక ఫోర్ కొట్టి ఎల్లో ఆర్మీకి విజయోత్సవ వేడుకల్లో చిరస్మరణీయమైన క్షణాన్ని అందించాడు. ఈ సందర్భంగా జడేజా తన ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు, అందులో జడేజా, అతని భార్య మరియు ధోనీతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. రెండవ ఫోటోలో జడ్డూ ఐపిఎల్ ట్రోఫీతో మహితో కనిపిస్తుండగా, మూడవ ఫోటోలో, ధోని తన ఒడిలో జడ్డూని మోస్తూ కనిపించాడు.
We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ
— Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023
చిరస్మరణీయ విజయంతో ఎంఎస్ ధోనీకి రవీంద్ర జడేజా మరో ప్రత్యేకమైన బహుమతిని అందించాడు. తాజాగా జడేజా తన ఇంస్టాగ్రామ్ Instagram ప్రొఫైల్ పిక్ మార్చారు. మ్యాచ్ అనంతరం ధోని జడేజాని పైకి లిఫ్ట్ చేసిన ఫోటోని జడేజా తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ గా మార్చుకున్నాడు. ఈ పిక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. సోషల్ మీడియాలో ధోని ఫాన్స్ జడ్డూపై చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ravindra Jadeja's new Instagram DP. pic.twitter.com/ea4AlYyyh9
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2023
చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ను మహీ ఎల్లో ఆర్మీ సమం చేసింది.
Read More: Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్