Rafael Nadal: రిటైర్మెంట్ పై టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కీలక వ్యాఖ్యలు.. 2024లో రిటైర్ అంటూ హింట్..!
గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాదల్ (Rafael Nadal) గురువారం ప్రకటించారు.
- Author : Gopichand
Date : 19-05-2023 - 10:46 IST
Published By : Hashtagu Telugu Desk
గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాదల్ (Rafael Nadal) గురువారం ప్రకటించారు. 22 గ్రాండ్ స్లామ్ విజేత రాఫెల్ నాదల్ (Rafael Nadal) ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ (రోలాండ్-గారోస్ 2023)లో పాల్గొనబోనని ప్రకటించాడు. మల్లోర్కాలోని తన అకాడమీలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాదల్ మాట్లాడుతూ.. 2024 తన వృత్తిపరమైన కెరీర్‌లో చివరి సంవత్సరం కావచ్చు అని పేర్కొన్నాడు. నాదల్ మాట్లాడుతూ.. నా గాయం కావాల్సినంతగా నయం కావడం లేదు. రోలాండ్-గారోస్‌లో ఆడడం నాకు అసాధ్యం. ఇది నాకు ఎంత కష్టమో మీరు ఊహించగలరు. నా శరీరం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పారు.
2023 సీజన్ ముగిసే సమయం తన కోసం వస్తుందని, అంటే తాను ఇకపై శిక్షణ కూడా తీసుకోనని, అయితే తన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, గాయం నయం అయ్యే వరకు వేచి ఉంటానని కూడా రాఫెల్ నాదల్ చెప్పాడు. ఈ సంవత్సరం చివరిలో జరిగే డేవిడ్ కప్ సందర్భంగా తిరిగి వస్తానని నాదల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: RCB vs SRH: ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ధనాధన్… కీలక మ్యాచ్ లో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ
2024 తన కెరీర్‌లో చివరి సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో సాధించకపోవడంతో ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన నాదల్ ఆ టోర్నీకి దూరం కావడం ఇదే తొలిసారి.
2005లో అరంగేట్రం చేసిన తర్వాత మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమవుతున్నాడు. పునరాగమనానికి మరింత సమయం పడుతుందని నాదల్ చెప్పాడు. 2024 సీజన్ తర్వాత ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించానన్నాడు. రొలాండ్ గారొస్‌లో ఇప్పటికే 14 టైటిల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 22 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.