PV Sindhu on Love & Marriage: అలీతో సరదాగా షోలో పీవీ సింధు.. ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పీవీ సింధు.. తెలుగువారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారినిగా పీవీ సింధు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
- By Nakshatra Published Date - 07:15 AM, Sun - 21 August 22
పీవీ సింధు.. తెలుగువారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారినిగా పీవీ సింధు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా భారత్ కి ఎన్నో పథకాలను సాధించి తెచ్చి పెట్టింది. పీవీ సింధు ఆట ఆడుతున్నప్పుడు, బయట ఒకే విధంగా ఉంటుంది. కాగా చాలా తక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనే పీవీ సింధు తాజాగా ఈటీవీలో ప్రసారమవ్వుతున్న అలీతో సరదాగా షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలు గురించి పంచుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో అలీ ఎప్పటిలాగే తనదైన శైలిలో పంచులు వేస్తూ పీవీ సింధుని అలాగే ప్రేక్షకులను నవ్వించినట్టు తెలుస్తోంది. ఈ షోలో భాగంగా పీవీ సింధు మాట్లాడుతూ ప్రేమ,పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హోస్ట్ అలీ ఇప్పటివరకు ఎన్ని లవ్ లెటర్స్ అందుకున్నావు అని ప్రశ్నించగా.. విషయం పై స్పందించిన సింధు.. లెటర్స్ వచ్చాయి.. ఇంటికి వచ్చాయి అంటూ కాస్త నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక వెంటనే అలీ.. ఆ లెటర్స్ నాన్నగారు చదివేవారా అని అడగగా..
అప్పుడు సింధు నవ్వుతూ అవును అందరూ కలిసి చదివే వాళ్ళం అని తెలిసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కపుల్ ఇయర్స్ బ్యాక్ 70 ఏళ్ల ఒక వృద్ధుడు తనని చేసుకోకపోతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని చెప్పుకొచ్చింది పీవీ సింధు. ఆ తర్వాత అలీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. నాకు నచ్చాలి అని అనడంతో అట్లా అంటూ నవ్వుకున్నారు అలీ,సింధు. కాగా షోలో బాగా సింధు చేసిన వాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. సింధు అభిమానులు ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Related News
Rajasekhar : ఫాదర్ రోల్ లో రాజశేఖర్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..?
Rajasekhar ఒకప్పుడు తన సినిమాలతో అలరించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయారని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో తనకంటూ ఒక మార్క్ ఉన్నా