Prithvi Shaw: కష్టాల్లో ఫృథ్వీ షా.. దేశీయ టోర్నీలోనూ విఫలం!
ఫృథ్వీ షా చిన్నతనంలోనే క్రికెట్‍లో చాలా సక్సెస్ చూశాడు. దేశవాళీ క్రికెట్‍లో పరుగుల వరద సృష్టిస్తూ రికార్డులను బద్దలుకొట్టాడు. అతడి సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్‍ను భారత్ గెలిచింది.
- By Naresh Kumar Published Date - 06:30 AM, Thu - 5 December 24

Prithvi Shaw: గత కొంతకాలంగా ఫృథ్వీ షా (Prithvi Shaw) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా దేశీయ టోర్నీలోనూ విఫలమవుతున్నాడు. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలోనూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. టీమిండియాను ఎలాల్సినవాడు ఇలా కెరీర్ మసకబారిపోవడం బాధాకరం.
ఫృథ్వీ షా చిన్నతనంలోనే క్రికెట్‍లో చాలా సక్సెస్ చూశాడు. దేశవాళీ క్రికెట్‍లో పరుగుల వరద సృష్టిస్తూ రికార్డులను బద్దలుకొట్టాడు. అతడి సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్‍ను భారత్ గెలిచింది. 19 ఏళ్ల వయసులో తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు సచిన్ తో పోల్చారు. కానీ ఇప్పుడు సచిన్ బాధపడేలా అతని కెరీర్ సాగుతుంది. ప్రస్తుతం పృథ్వీషా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ టోర్నీలో చివరి 5 మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. మహారాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను డకౌట్ అయ్యాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు, ఆ తర్వాత గోవాపై 33 పరుగులు చేసి ఔటయ్యాడు, నాగాలాండ్ జట్టుపై 40 పరుగులు చేశాడు. ఇప్పుడు సర్వీసెస్ తో జరిగిన మ్యాచ్ లోను డకౌట్ అయ్యాడు. అతనితో పాటు ఉన్న సూర్యకుమార్ యాదవ్ 70 పరుగులు చేయగా , శివమ్ దూబే 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విధంగా ముంబై జట్టు 192 పరుగులు చేసింది. అయితే పృథ్వీ షాను ఏ మాత్రం తక్కువ చేయకూడదు.
Also Read: Pink Ball Most Wickets: రెండో టెస్టు.. టీమిండియాకు ముప్పుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్!
2018 సంవత్సరంలో ఐసీసీ అతన్ని పురుషుల క్రికెట్‌లో టాప్-5 ఆటగాడిగా గుర్తించింది. కానీ ఆ మంచితనం ఎక్కువరోజులు నిలుపుకోలేకపోయాడు. 2019లో బీసీసీఐ అతనిపై డోపింగ్ నిషేధం విధించింది. నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో పెరిగిన పృథ్వీ షాకు సక్సెస్ వచ్చినట్టే వచ్చి పలకరించి వెళ్ళిపోయింది. 23 ఏళ్ల వయసులోనే పొట్ట, బట్టతో కనిపించి తీవ్ర బాడీషేమింగ్‌కు గురయ్యాడు. కోచ్‌ల మాట వినకపోవడం.. సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడంతో ముంబై జట్టు కూడా అతన్ని రంజీ టీమ్ నుంచి తప్పించింది. ఇలా పృథ్వీ షా కెరీర్ హీరో నుంచి జీరోకి మారింది. పృథ్వీషా లాంటి ప్రతిభవంతుడైన ఆటగాడి కెరీర్ రివర్స్ డైరెక్షన్‌లో వెళ్లడం బాధాకరం.