world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో తలపడ్డ ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది.
- By Praveen Aluthuru Published Date - 12:37 PM, Mon - 20 November 23

world cup 2023: ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభాన్ని అందించాడు. మరో ఎండ్ లో గిల్ నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ మరోసారి డిపెండింగ్ ఆడాడు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటినా కమిన్స్ బౌలింగ్ లో సెల్ఫ్ వికెట్ సమర్పించుకున్నాడు. టీమిండియా ఓటమి ఆటగాళ్లను కన్నీళ్లు పెట్టించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, సిరాజ్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు మరియు దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చారు అని మోడీ ట్వీట్ చేశారు. కాగా ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ భీకర సెంచరీతో జట్టుకు బలం చేకూర్చడంతో ఆస్ట్రేలియా అద్భుతమైన రీతిలో ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
2023 ప్రపంచకప్ లో కింగ్ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 765 పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధికంగా 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో కోహ్లీ కొట్టినన్ని పరుగులు ఇంతవరకు ఏ ఆటగాడు సాధించలేదు. మరోవైపు ఈ మెగాటోర్నీలో కింగ్ మూడు శతకాలు బాదాడు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై కోహ్లీ సెంచరీలు నమోదు చేశాడు.
Also Read: Napoleons Hat : నెపోలియన్ హ్యాటా మజాకా.. వ్యాల్యూ పైపైకే
Related News

India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.