PKL Season 11 Auction: ప్రో కబడ్డీ లీగ్ ఆటగాళ్ల వేలం.. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే..!
పవన్ సెహ్రావత్, మణిందర్ సింగ్‌ల బిడ్‌లు కూడా రూ. 1 కోటి దాటాయి. అయితే వారి పాత జట్లు FBM (ఫైనల్ మ్యాచ్ బిడ్) ఉపయోగించి వాటిని నిలుపుకున్నాయి.
- By Gopichand Published Date - 10:12 AM, Fri - 16 August 24

PKL Season 11 Auction: ప్రో కబడ్డీ లీగ్ (PKL Season 11 Auction) 2024 వేలం మొదటి రోజున 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అందులో స్టార్ రైడర్ సచిన్ తన్వర్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ తన్వర్ కోసం 2 కోట్ల 15 లక్షల రూపాయల బిడ్ దాఖలైంది. ఇరాన్‌కు చెందిన ఆల్ మహ్మద్రెజా షాద్లు వరుసగా రెండో సీజన్‌కు రూ. 2 కోట్లకు పైగా అమ్ముడయ్యాడు. గత సీజన్ అంటే పీకేఎల్-10 ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్ అతడిని రూ.2 కోట్ల 7 లక్షలకు కొనుగోలు చేసింది. ఆగస్టు 15న పీకేఎల్ 11వ సీజన్ కోసం ముంబైలో నిర్వహించిన వేలంలో తొలిరోజు మొత్తం 8 మంది ఆటగాళ్లు రూ.కోటికి పైగా అమ్ముడుపోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భరత్ హుడా, గుమాన్ సింగ్ కూడా కోటీశ్వరులయ్యారు.
పవన్ సెహ్రావత్, మణిందర్ సింగ్‌ల బిడ్‌లు కూడా రూ. 1 కోటి దాటాయి. అయితే వారి పాత జట్లు FBM (ఫైనల్ మ్యాచ్ బిడ్) ఉపయోగించి వాటిని నిలుపుకున్నాయి. పర్దీప్ నర్వాల్‌తో సహా పలువురు అనుభవజ్ఞులు జట్లు మారారు. రాబోయే సీజన్‌లో ఈ దిగ్గజాలు ఏ టీమ్‌ల కోసం ఆడతారో తెలుసుకుందాం.
సచిన్ తన్వర్ (తమిళ తలైవాస్)
సచిన్ తన్వర్ కోసం రూ. 2.15 కోట్లకు బిడ్ చేసిన రికార్డు టీమ్ తమిళ్ తలైవాస్. PKL-11లో సచిన్ తమిళ్ తలైవాస్ జెర్సీలో కనిపించనున్నాడు. గత సీజన్‌లో పాట్నా పైరేట్స్ తరఫున ఆడాడు.
Also Read: Uttar Pradesh: నర్సు పై రోజువారి కూలీ అత్యాచారం
భరత్ హుడా (యుపి యోధా)
ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో భరత్ హుడాను యూపీ యోధా రూ. 1 కోటి 30 లక్షలకు కొనుగోలు చేసింది. అతను రాబోయే సీజన్‌లో యూపీ తరఫున ఆడబోతున్నాడు. భరత్ హుడా గత సీజన్‌లో బెంగళూరు బుల్స్‌కు ఆడాడు.
పర్దీప్ నర్వాల్ (బెంగళూరు బుల్స్)
పర్దీప్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.70 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది. ‘దుబ్కీ కింగ్’ పర్దీప్ నర్వాల్ గత మూడు సీజన్లలో UP యోధా తరపున ఆడాడు.
We’re now on WhatsApp. Click to Join.
గుమాన్ సింగ్ (గుజరాత్ జెయింట్స్)
ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో విక్రయించబడిన మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడు గుమాన్ సింగ్. రూ. 1 కోటి 97 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అతను PKL-11లో గుజరాత్ జెర్సీలో కనిపించనున్నాడు. గుమాన్ సింగ్ గత రెండు సీజన్లలో యు-ముంబా తరపున ఆడాడు.