Uttar Pradesh: నర్సు పై రోజువారి కూలీ అత్యాచారం
- By Sudheer Published Date - 09:34 AM, Fri - 16 August 24

దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ అనేది కరవైంది. ఒంటరి మహిళే కాదు..అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట మహిళ ఫై అత్యాచారం అనేది వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 15 రోజుల క్రితం జరిగిన అత్యాచారం & హత్య ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ అత్యాచారం చేసి , చంపేశాడు. ఈ ఘటన జులై 30న జరిగింది. బిలాస్ పూర్ పట్టణంలో 33 ఏళ్ల ఓ మహిళా నర్సు అద్దెగదిలో కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే జులై 30న తాను చేస్తున్న రుద్రాపూర్ హాస్పటల్ నుంచి తన విధులు నిర్వహించుకొని రాత్రి పూట ఇంటికి బయల్దేరింది. అయితే ఆమె ఎంత సమయం గడిచినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎనిమిది రోజుల తరువాత ఆమె ఉండే అపార్ట్‌మెంట్ కు సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని శవపరీక్షకు పంపగా..ఆమె హత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ధర్మేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారించగా..నిజం ఒప్పుకున్నాడు. ఆమె ఇంటి సమీపంలోనే మెడకు చున్నీ బిగించి హత్య చేసి..ఆ తరువాత అత్యాచారం చేసినట్లు తెలిపాడు. ఆ తరువాత ఆమెఫోన్, నగలు, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయినట్లు వివరించారు. మృతురాలి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. ఇదిలా ఉంటె కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశం మొత్తం నిరసనలు తెలుపుతుంది.
Read Also : KTR Tweet: మహిళల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్.. ఎక్స్ ఖాతా వేదికగా స్పందన!