Ramiz Raja: క్లీన్ స్వీప్ దెబ్బకు పిసిబి చైర్మన్ పదవి ఊస్ట్
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజా (Ramiz Raja)ను ఇంటికి సాగనంపింది. గతేడాది సెప్టెంబర్‌లో రమీజ్ రాజా (Ramiz Raja) పీసీబీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీబీ ఛైర్మన్ అయిన తర్వాత పాకిస్థాన్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడింది.
- Author : Gopichand
Date : 22-12-2022 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన పాక్ జట్టుపై ఆ దేశ మాజీలు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి. దీంతో పాక్ క్రికెట్ లో ప్రక్షాళన మొదలయింది. అయితే ముందు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజా (Ramiz Raja)ను ఇంటికి సాగనంపింది. గతేడాది సెప్టెంబర్‌లో రమీజ్ రాజా (Ramiz Raja) పీసీబీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీబీ ఛైర్మన్ అయిన తర్వాత పాకిస్థాన్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడింది. ఈ ఏడాది ఫైనల్ వరకూ వచ్చిన కప్పు గెలవలేకపోయింది.
రమీజ్ రాజాను పీసీబీ పదవి నుంచి తప్పించగానే ఆయన స్థానంలో నజమ్ సేఠీని కొత్త ఛైర్మన్‌గా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నియమించినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తరచూ భారత్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు , అక్కసు వెళ్లగక్కారు.వచ్చే ఏడాది ఆసియా కప్ వేదికను పాకిస్థాన్‌ను మార్చనున్నట్లు వచ్చిన వార్తలపైన తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే తాము ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ నుంచి కూడా తప్పుకుంటామని హెచ్చరించారు.
Also Read: Pakistan star bowler: పెళ్లి పీటలెక్కనున్న పాక్ ఫాస్ట్ బౌలర్
దీంతో రమీజ్ కామెంట్స్ పై పలువురు భారత మాజీలు మండిపడ్డారు. అటు బీసీసీఐ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చాలా సందర్భాల్లో ఆయన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది.అటు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంను కూడా కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం జట్టు ప్రక్షాళన పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా చాలా ఏళ్ళ తర్వాత పాక్ వచ్చిన ఇంగ్లాండ్ అదరగొట్టింది. టెస్ట్ సీరీస్ లో పాక్ ను చిత్తుగా ఓడించింది.