IPL 2022 : చెన్నైని వెంటాడుతున్న గాయాలు
ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను వరుస పరాజయాలతో పాటు వరుస గాయాలు వెంటాడుతున్నాయి.
- Author : Naresh Kumar
Date : 27-04-2022 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను వరుస పరాజయాలతో పాటు వరుస గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్.. గాయాల కారణంగా ఇప్పటికే ముగ్గురు స్టార్ ఆటగాళ్లను కోల్పోయింది. తొలుత మెగా వేలంలో 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవగా.., ఆ తర్వాత మెగావేలంలో 1.9 కోట్లకు కొనుగోలు చేసిన న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.
అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో మొయిన్ అలీ గాయపడ్డాడు. దీంతో అతడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ తో పాటుగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉంటె మాత్రం టోర్నీ నుంచి తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2022 లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో సీఎస్‌కే మరో పరాజయం చవి చూసింది.పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతి వరకు పోరాడినప్పటికి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టమయ్యాయి.