Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది.
- By Praveen Aluthuru Published Date - 07:58 PM, Sat - 31 August 24

Paralympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అయిదో పతకం చేరింది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్-1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం, ఇరాన్ షూటర్ సరేహ్ జవాన్‌మర్ది స్వర్ణం, తుర్కియే షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం సాధించారు.
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది. ఫలితంగా ఆమె మూడో స్థానంలో నిలిచి రుబీనా ఫ్రాన్సిస్ చరిత్ర సృష్టించింది. పిస్టల్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ పారా-షూటింగ్ అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఫైనల్ స్వర్ణ పతకాన్ని ఇరాన్ క్రీడాకారిణి జవాన్‌మర్ది సారే గెలుచుకుంది. ఆమె 236.8 స్కోర్ సాధించింది. తుర్కియేకు చెందిన ఓజ్గాన్ ఐసెల్ రజత పతకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె 231.1 స్కోర్ సాధించింది. తొలుత రూబిన్ పోటీలో రెండవ స్థానంలో నిలిచింది. చివరిలో వెనకబడింది.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన రుబీనా ఫ్రాన్సిస్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నివాసి. ప్రపంచ వేదికను పంచుకోవడానికి ఆమె ఎంతో కష్టపడింది. తండ్రి సైమన్ ఫ్రాన్సిస్ మెకానిక్ గా పని చేస్తారు. రుబీనా ఎదిగేక్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య గెలవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read: Makeup Tips : మేకప్‌కు సంబంధించిన ఈ చెడు అలవాట్లతో ముందే ముడతలు వస్తాయి..!