T20 World Cup: మెరిసిన బాబర్, రిజ్వాన్.. ఫైనల్లో పాకిస్తాన్
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సిడ్నీ వేదికగా జరిగిన సెమీస్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
- Author : Naresh Kumar
Date : 09-11-2022 - 5:12 IST
Published By : Hashtagu Telugu Desk
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సిడ్నీ వేదికగా జరిగిన సెమీస్‌లో ఆ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. మెగా టోర్నీల్లో కివీస్‌పై తమకు ఉన్న రికార్డును మరోసారి కొనసాగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. చేసింది. విలియమ్సన్ , మిఛెల్ ఆదుకోకుంటే కివీస్ మరింత తక్కువ స్కోరుకు పరిమితమయ్యేది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. చివర్లో విలియమ్సన్ 46 రన్స్ కు ఔటైనా మిఛెల్ ధాటిగా ఆడాడు. మిఛెల్ 35 బంతుల్లోనే 3 ఫోర్లు,1 సిక్సర్‌తో 53 పరుగులు చేశాడు. నీషన్ 12 బంతుల్లో 16 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కివీస్ 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీసాడు.
ఛేజింగ్‌లో పాకిస్తాన్‌కు ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలోనే 105 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో పెద్దగా రాణించని వీరిద్దరూ సెమస్‌లో మాత్రం రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. రిజ్వాన్ 43 బంతుల్లో 5 ఫోర్లతో 57 , బాబర్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 53 రన్స్‌కు ఔటయ్యారు. ఓపెనర్ల జోరుతో పాకిస్తాన్ పవర్ ప్లేలో 55 రన్స్ చేసింది. రిజ్వాన్, బాబర్ ఔటైన తర్వాత కివీస్ కట్టడి చేసేందుకు ప్రయత్నించినా సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా లేకపోవడంతో ఫలితం దక్కలేదు. మహ్మద్ హ్యారిస్ 30 రన్స్‌కు ఔటవగా.. తర్వాత షాన్ మసూద్, ఇప్తికర్ మహ్మద్ పాక్ విజయాన్ని పూర్తి చేశారు. పాక్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.
Scenes at the SCG 🎊🙌#WeHaveWeWill | #T20WorldCup | #NZvPAK pic.twitter.com/r15qUjVyFX
— Pakistan Cricket (@TheRealPCB) November 9, 2022