Champions Trophy 2025: మీరు మా దేశం వస్తేనే మేము ప్రపంచకప్ ఆడతాం: పాక్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ క్రికెట్ బహిష్కరిస్తుందని నివేదికలు సుచిస్తున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 15-07-2024 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
Champions Trophy 2025: టి20 ప్రపంచకప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చాలని బీసీసీఐ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐసీసీ పునరాలోచించాలని బీసీసీఐ ఐసీసీనీ కోరుతుంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బోర్డు అభ్యర్థించింది. ఇది జరిగితే భారత్ ఆడే మ్యాచ్ లు మరో దేశంలో నిర్వహిస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ క్రికెట్ బహిష్కరిస్తుందని నివేదికలు సుచిస్తున్నాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకపోతే 2026లో పాకిస్థాన్ భారత్‌లో పర్యటించదని తెలిపింది. ICC వార్షిక సమావేశం జూలై 19-22 మధ్య కొలంబోలో జరుగుతుంది.ఈ సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆసియా కప్ కోసం టీమిండియా 2008లో చివరిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్లు ఇప్పుడు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2023 ఆసియా కప్ సందర్భంగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. అయితే అనేక చర్చల అనంతరం 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. పాక్ పర్యటనలో ఇండియాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తలేదు. అంతే కాదు హైదరాబాద్ లో పర్యటించిన పాక్ ఆటగాళ్లు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బిర్యానీ రుచి చూసిన బాబర్ సేన ఫిదా అయింది. ఇక్కడ ఆతిధ్యం నచ్చడంతో మళ్ళీ హైదరాబాద్ రావాలని పలువురు క్రికెటర్లు బాహాటంగానే తెలిపారు. విశేషం ఏంటంటే బాబర్ అజాం పెళ్లి షాపింగ్ కూడా ఇండియాలోనే జరిగింది. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత నవంబర్ ఆఖర్లో బాబర్ ఆజమ్ పెళ్లి చేసుకోనున్నాడు. దానికి సంబంధించిన షాపింగ్ ను బాబర్ కోల్ కతాలో పూర్తి చేశాడు. పెళ్లి కోసం ఏకంగా 7 లక్షలు విలువైన షెర్వాణీని కొనుగోలు చేశాడు.
Also Read; Bhagyasri Borse : రవితేజ హీరోయిన్ అప్పుడే సొంత డబ్బింగ్ చెప్పేస్తుంది..!