Bhagyasri Borse : రవితేజ హీరోయిన్ అప్పుడే సొంత డబ్బింగ్ చెప్పేస్తుంది..!
షో రీల్ రిలీజ్ కాగా మాస్ రాజా (Mass Raja) ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.
- By Ramesh Published Date - 03:06 PM, Mon - 15 July 24

బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిందో లేదో అప్పుడే టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ (Bhagyasri Borse). హిందీలో యారియార్ 2, చందు చాంపియన్ (Chandu Champion) సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ దృష్టిలో పడింది. వెంటనే అతను చేస్తున్న రవితేజ సినిమాలో ఆమెను తీసుకున్నారు. మాస్ రాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ లక్కీ ఛాన్స్ అందుకుంది.
మిస్టర్ బచ్చన్ నుంచి మొన్నామధ్య షో రీల్ రిలీజ్ కాగా మాస్ రాజా (Mass Raja) ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఇక రీసెంట్ గా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ లో భాగ్య శ్రీ అందాలు కుర్రాళ్లకు పండుగ చేసుకునేలా ఉన్నాయి.
సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా (Mr Bacchan Movie) ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా మరోపక్క హీరోయిన్ డబ్బింగ్ పూర్తి చేస్తుంది. ఐతే ఈ సినిమా కోసం భాగ్య శ్రీ సొంత డబ్బింగ్ చెబుతుందని తెలుస్తుంది. ఒకప్పుడు మన హీరోయిన్స్ కి సెపరేట్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండే వారు. కానీ ఇప్పుడు అందరు హీరోయిన్స్ సొంత డబ్బింగ్ చెబుతున్నారు.
తెలుగు ఆడియన్స్ కూడా సొంత డబ్బింగ్ చెప్పే హీరోయిన్స్ ను ఇష్టపడుతున్నారు. ఒకరకంగా డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇది ఇబ్బంది కరంగా ఉన్నా హీరోయిన్స్ సొంత డబ్బింగ్ సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ కూడా మిస్టర్ బచ్చన్ కి సొంత డబ్బింగ్ చెబుతుంది. ఆ విషయాన్నే తన సోషల్ మీడియాలో చెప్పి ఆడియన్స్ ని థ్రిల్ చేసింది అమ్మడు.