ODI World Cup: ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు.. ఆఫ్ఘన్ తో ఆడే భారత్ తుది జట్టు ఇదే..!
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)ను విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కి సిద్ధమయింది. బుధవారం ఆఫ్గనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
- Author : Hashtag U
Date : 10-10-2023 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
ODI World Cup: వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)ను విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కి సిద్ధమయింది. బుధవారం ఆఫ్గనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సంచలనాలు సృష్టించే అలవాటు ఉన్న ఆఫ్గనిస్తాన్ ను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. తుది జట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోకపోవడంతో ఇషాన్ కిషనే ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్‌పై టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
మూడో పేసర్‌గా మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోనున్నారు. ఢిల్లీ పిచ్ పై శ్రీలంక , సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. సఫారీ జట్టులో ఏకంగా ముగ్గురు శతకాలు సాధించగా.. ఆ జట్టు 428 రన్స్ చేసింది. దీంతో మరోసారి బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా. ఒకవేళ పిచ్‌ను మార్చి స్లో వికెట్‌ను సిద్దం చేస్తే మాత్రం అశ్వినే జట్టులో కొనసాగనున్నాడు. అప్పుడు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా మరోసారి రోహిత్, ఇషాన్ బరిలోకి దిగనుండగా..విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
విరాట్ కోహ్లీకి ఢిల్లీ హోమ్ గ్రౌండ్. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి దినున్నాడు. ఆస్ట్రేలియా పై కోహ్లీ , రాహుల్ ఫామ్ లోకి రాగా.. మిగిలిన బ్యాటర్లు కూడా చెలరేగితే పాక్ తో మ్యాచ్ కు ముందు జట్టుకు అడ్వాంటేజ్. బౌలింగ్ లో స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉన్నారు.
ఆఫ్గనిస్తాన్ తో టీభారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్.